UIDAI: తల్లిదండ్రులకు అలెర్ట్.. చిన్నారుల ఆధార్ కార్డుపై కేంద్రం కీలక సూచన

UIDAI: తల్లిదండ్రులకు అలెర్ట్.. చిన్నారుల ఆధార్ కార్డుపై కేంద్రం కీలక సూచన
x
Highlights

UIDAI: చిన్నారుల కోసం భారత ప్రభుత్వం ప్రత్యేకంగా జారీ చేసే బాల ఆధార్‌ గురించి అందరికీ తెలిసిందే.

UIDAI: చిన్నారుల కోసం భారత ప్రభుత్వం ప్రత్యేకంగా జారీ చేసే బాల ఆధార్‌ గురించి అందరికీ తెలిసిందే. పుట్టిన తర్వాత పేరుతో పాటు ఫోటో ఆధారంగా మాత్రమే జారీచేసే ఈ కార్డు, పిల్లలు ఐదేళ్ల వయస్సు దాటిన తర్వాత తప్పనిసరిగా అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తాజాగా యూఐడీఏఐ (UIDAI) ఈ అంశంపై స్పష్టమైన సూచనలు జారీ చేసింది.

5 ఏళ్లు దాటిన వెంటనే అప్‌డేట్ తప్పనిసరి

పిల్లలు ఐదేళ్లు పూర్తి చేసిన వెంటనే వేలిముద్రలు, కనుపాపల స్కాన్‌, ఫోటో అప్‌డేట్ చేయాల్సిందిగా UIDAI సూచించింది. ఇలా చేయకపోతే ఆ బాల ఆధార్‌ చెల్లుబాటు కాకపోవచ్చు, రద్దయ్యే ప్రమాదముందని హెచ్చరించింది.

7 ఏళ్లు దాటినా అప్‌డేట్ చేయకపోతే...?

UIDAI ప్రకారం, ఏడు ఏళ్లు దాటినప్పటికీ బాల ఆధార్‌ను అప్‌డేట్ చేయకపోతే, ఆ కార్డు వ్యవస్థలో చెల్లుబాటు కానిది అవుతుందని స్పష్టం చేసింది. అందుకే పేరెంట్స్ తప్పక ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఫోన్‌కు అలర్ట్ మెసేజ్‌లు

ఈ అప్‌డేట్ అవసరాన్ని తెలియజేస్తూ, బాల ఆధార్ తీసుకున్న సమయంలో నమోదైన ఫోన్ నంబర్‌కు అలర్ట్ మెసేజ్‌లు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇవి సకాలంలో స్పందించకపోతే ఆధార్ సర్వీసులు పొందడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు.

అప్‌డేట్ ఫీజు ఎంత?

5–7 ఏళ్ల లోపు పిల్లలకి బాల ఆధార్ అప్‌డేట్ పూర్తిగా ఉచితం.

7 ఏళ్లు దాటిన పిల్లలకు అప్‌డేట్ చేయాలంటే రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

మీ చిన్నారి ఐదేళ్లు దాటిన తర్వాత బాల ఆధార్‌ను అప్‌డేట్ చేయడం అనివార్యం. లేదంటే రద్దయ్యే ప్రమాదం ఉంటుంది. ఆందువల్ల సమయానికి UIDAI కేంద్రాల్లో లేదా ఆధార్ సేవా కేంద్రాల్లో ఈ అప్‌డేట్ పూర్తి చేయడం ఎంతో అవసరం.

Show Full Article
Print Article
Next Story
More Stories