DMart: డీ మార్ట్‌లో షాపింగ్ చేసి డబ్బులను ఆదా చేస్తున్నారా? అయితే ఈ సారి ఇలా చేసి చూడండి..

Avenue Supermarts Shares Drop 4% After DMart Announces Q1 Results
x

DMart: డీ మార్ట్‌లో షాపింగ్ చేసి డబ్బులను ఆదా చేస్తున్నారా? అయితే ఈ సారి ఇలా చేసి చూడండి..

Highlights

DMart: మధ్య తరగతి ప్రజల షాపింగ్ సెంటర్...డీ మార్ట్. ఇందులో ఎక్కువ డిస్కౌంట్లు ఉండడంతో అందరు తెగ షాపింగ్ చేసేస్తు ఉంటారు.

DMart: మధ్య తరగతి ప్రజల షాపింగ్ సెంటర్...డీ మార్ట్. ఇందులో ఎక్కువ డిస్కౌంట్లు ఉండడంతో అందరు తెగ షాపింగ్ చేసేస్తు ఉంటారు. దీనివల్ల ఎంతోకొంత డబ్బులను ఆదా చేసామని ఫీల్ అవుతుంటారు. అయితే ఈ సారి ఇలా చేసి చూడండి. కొంత డబ్బు కాదు ఎక్కువ మొత్తంలో లాభాలు పొందుతారు.

డీ–మార్ట్‌లో అన్ని రకాల వస్తువులు చవకైన దరలలో అందుబాటులో ఉంటాయి. అందుకే చాలామంది డీ మార్ట్‌లో షాపింగ్ చేస్తుంటారు. దీనికితోడు వన్ ప్లస్ వన్ ఆఫర్లు, 50% డిస్కౌంట్లు అప్పుడప్పుడు పెట్టడంతో ఎగబడి మరీ షాపింగ్ చేస్తుంటారు. నిజంగా మామూలు షాపులతో పోలిస్తే క్వాలిటి విషయం ఎలా ఉన్నా.. ఇక్కడ వస్తువులు రేట్లు కాస్త తక్కువగానే ఉంటాయి. దీంతో మధ్యతరగతి ప్రజలు కాస్త డబ్బును పొదుపు చేయొచ్చు. అయితే ఈ సారి మీ దగ్గర ఉన్న కొంత డబ్బును డీ మార్ట్ షేర్ లో పెట్టండి. అప్పుడు మీ డబ్బులు రెట్టింపు లాభంతో మీకు తిరిగి వస్తాయి.

డీ మార్ట్ షేర్స్‌ను మీరు కొంటే.. డబ్బులు డబుల్ అవడం ఖాయం. అదెలా అని ఆలోచిస్తున్నారా? ప్రస్తుతం డీ మార్ట్ షేర్ రూ. 4070.20గా ఉంది. ఈ షేర్‌‌లో మీరు ఇన్వెస్ట్ చేసే ఆరు నెలలో డబ్బులు డబుల్ అయ్యే అవకాశం ఉంది. వారం రోజులుగా కొన్ని అనిశ్చిత కారణాల వల్ల షేర్ ధర కాస్త తగ్గినా.. మళ్లీ పుంజుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇప్పుడున్న షేర్ ధర ప్రకారం డబ్బులు పెడితే కచ్చితంగా 6 నెలల్లో మీ డబ్బులు డబుల్ అవ్వడం ఖాయం. అదేవిధంగా Q1 ఫలితాలు వచ్చాక షేర్ కచ్చితంగా దూసుకుపోతుందని అనలిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం డీ మార్ట్‌ షేర్ 52 వీక్ హై నుంచి ప్రస్తుతం డౌన్ ట్రెండ్‌లో ట్రేడ్ అవుతోంది. కానీ మరో ఆరు నెలల్లో సర్ఫ్రైజ్‌గా 52 వీక్ హై టచ్ అవ్వడం ఖాయమని అనలిస్టులు చెబుతున్నారు. డిమార్ట్ గత 52 వీక్ హై 5484.85గా ఉంది. కాబట్టి ఈ సారి ఈ షేర్‌‌లో పైసలు పెడితే డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories