ATM PIN Number: ఏటీఎం పిన్‌ నెంబర్‌ 4 అంకెలు మాత్రమే ఎందుకు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ATM PIN Number is Only 4 Digits You Will be Surprised to Hear the Reason
x

ATM PIN Number: ఏటీఎం పిన్‌ నెంబర్‌ 4 అంకెలు మాత్రమే ఎందుకు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Highlights

ATM PIN Number: ఆధునిక కాలంలో ప్రతి పని సులభంగా అయిపోతుంది. ఇప్పుడు ప్రజలు నగదు లేకుండా ఎక్కడికైనా ప్రయాణించవచ్చు.

ATM PIN Number: ఆధునిక కాలంలో ప్రతి పని సులభంగా అయిపోతుంది. ఇప్పుడు ప్రజలు నగదు లేకుండా ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఒకవేళ నగదు అవసరం ఏర్పడినా ఎక్కడపడితే అక్కడ ఏటీఎం మిషన్లు ఉండనే ఉన్నాయి. వ్యక్తులు తమ కార్డును మిషన్‌లో చొప్పించి పిన్ ఎంటర్‌ చేసి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసే ప్రక్రియ చాలా సులభం. ఎవరైనా ఏ బ్యాంకు ఏటీఎం నుంచైనా డబ్బు తీసుకోవచ్చు.

ఎందుకంటే మీ కార్డుకి ఒక పిన్‌ నెంబర్ జనరేట్ అయి ఉంటుంది. మీ డబ్బును భద్రపరిచే ఏకైక భద్రతా సాధనం పిన్‌ నెంబర్‌ మాత్రమే. సాధారణంగా ఈ పిన్‌ నెంబర్‌ 4 అంకెలతో ఉంటుంది. అయితే 4 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటుందో ఎవ్వరికి తెలియదు. దీని వెనుక ఒక సీక్రెట్ దాగి ఉంది. దాని గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు పిన్‌ నెంబర్‌ 4 అంకెలు కాకుండా 6 అంకెలు ఉండేవి.

కానీ ప్రజలు సాధారణంగా 4 అంకెల పిన్‌ను మాత్రమే గుర్తుంచుకోగలరని నిపుణులు గ్రహించారు. 6 అంకెల పిన్‌లో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. దీని కారణంగా ఏటీఎం వినియోగం తగ్గడం ప్రారంభమైంది. దీని తర్వాత ఏటీఎం పిన్ 4 అంకెలకు తగ్గించారు. కానీ ఇప్పటికీ నిజం ఏంటంటే 4 అంకెల ఏటీఎం పిన్ నెంబర్‌ కంటే 6 అంకెల పిన్ నెంబర్ చాలా సురక్షితమైనది. 4 అంకెల పిన్ 0000 నుంచి 9999 వరకు ఉంటుంది.

ఇందులో 20 శాతం పిన్‌లను హ్యాక్ చేయవచ్చు. ఇది కొంచెం కష్టమైన పని అయినప్పటికీ 6 అంకెల పిన్ కంటే కొంచెం తక్కువ సురక్షితమైనది. నేటికీ చాలా దేశాలు 6 అంకెల ఏటీఎం పిన్‌ను మాత్రమే ఉపయోగిస్తున్నాయి. ఈ యంత్రాన్ని స్కాటిష్ శాస్త్రవేత్త కనుగొన్నారు. ఆయన పేరు జాన్ అడ్రియన్ షెపర్డ్-బారన్. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ స్కాటిష్ శాస్త్రవేత్త భారతదేశంలోనే షిల్లాంగ్ నగరంలో జన్మించాడు. 1969లో ఏటీఎం మెషీన్‌ను తయారు చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories