Vehicle Insurance: వెహికల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారా.. వర్షాలు, భూకంపాలకు అప్లై అవుతుందా..!

Are You Taking Vehicle Insurance Know Whether It Applies To Rains And Earthquakes
x

Vehicle Insurance: వెహికల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారా.. వర్షాలు, భూకంపాలకు అప్లై అవుతుందా..!

Highlights

Vehicle Insurance: ట్రాఫిక్‌ రూల్స్‌ ప్రకారం వెహికల్‌ ఇన్సూరెన్స్‌ లేదంటే వాహనాన్ని రోడ్డుపైకి తీసుకురాకూడదు.

Vehicle Insurance: ట్రాఫిక్‌ రూల్స్‌ ప్రకారం వెహికల్‌ ఇన్సూరెన్స్‌ లేదంటే వాహనాన్ని రోడ్డుపైకి తీసుకురాకూడదు. ప్రమాదాలు జరిగినప్పుడు చాలా సమస్యలు ఎదురవుతాయి. టూ వీలర్‌ అయినా ఫోర్‌ వీలర్‌ అయినా ఏ వాహనం కలిగి ఉన్నా ఇన్సూరెన్స్‌ అనేది తప్పనిసరి తీసుకోవా లి. అయితే దీనికి ముందు ఇన్సూరెన్స్‌ కంపెనీలు, వాటి పాలసీలు, కవరేజీ మొదలైన విషయా ల గురించి అవగాహన కలిగి ఉండాలి. వర్షాలు, భూకంపాల వంటి విపత్తులు వచ్చినప్పుడు వెహికల్‌ ఇన్సూరెన్స్‌ వర్తిస్తుందా లేదా తెలుసుకోవాలి. దీని గురించి ఈ రోజు చర్చిద్దాం.

మీ కారు ఇన్సూరెన్స్ వరద నష్టాన్ని కవర్ చేస్తుందా లేదా అనేది చాలా మందికి అనుమానం ఉంటుంది. అయితే బీమా కవరేజి అనేది మీరు ఎంచుకున్న ప్లాన్‌పై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. మీరు సమగ్ర కవరేజీని కలిగి ఉంటే మాత్రమే వరదల వల్ల కలిగే నష్టం కవర్ అవుతుంది. ఇందుకోసం వరదలు, తుఫానులు, భూకంపాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలను కవర్ చేసే సమగ్ర కారు బీమా పాలసీని తీసకోవాలి.

వరదల వల్ల మీ కారు ఘోరంగా దెబ్బతింటుంది. వాహనంలోకి నీరు ప్రవేశించడ వల్ల ఇంజిన్, గేర్‌బాక్స్, ఎలక్ట్రానిక్స్ వంటి అన్ని భాగాలు పాడవుతాయి. అలాగే షార్ట్ సర్క్యూట్ కారణంగా కారుకు సంబంధించిన ఎలక్ట్రానిక్స్ పని చేయడం ఆగిపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వాహనాన్ని కవర్ చేసే బీమా ప్లాన్‌ను మీరు ఇప్పటికే ఎంచుకుంటే తర్వాత వాటిబేస్ ప్లాన్‌ లో తగిన యాడ్-ఆన్లను పొందడం అవసరం. ఉదాహరణకు మీరు మీ ప్లాన్ ను ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్, ఇన్వాయిస్ కవర్‌కు తిరిగి వెళ్లాలి. జీరో డిప్రిసియేషన్ కవర్, నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్ కవర్, కీ రీప్లేస్మెంట్ కవర్, ఇతర వాటితో పొడిగించుకోవచ్చు. దీని గురించి సమాచారం ముందుగానే తెలుసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories