CIBIL Score: ఒకటికి రెండు సార్లు సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే..మీరు చేయకూడని తప్పులు ఇవే..

Are you checking your CIBIL score once or twice? But this is for you
x

CIBIL Score: ఒకటికి రెండు సార్లు సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే..మీరు చేయకూడని తప్పులు ఇవే..

Highlights

CIBIL Score: ప్రస్తుత కాలంలో క్రెడిట్ స్కోర్ అనేది చాలా తప్పనిసరి అయిపోయింది. క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ అనేది ఒక రుణం తీసుకోవాలంటే బ్యాంకు...

CIBIL Score: ప్రస్తుత కాలంలో క్రెడిట్ స్కోర్ అనేది చాలా తప్పనిసరి అయిపోయింది. క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ అనేది ఒక రుణం తీసుకోవాలంటే బ్యాంకు నుంచి తప్పనిసరి అని చెప్పవచ్చు. బ్యాంకులో ఈ సిబిల్ స్కోర్ చూస్తే గాని మీకు ఎలాంటి రుణం ఇవ్వాలన్నా కూడా ప్రాసెస్ చేయడం లేదు. సిబిల్ స్కోర్ కనీసం 750 నుంచి 900 మధ్యలో ఉంటేనే రుణాలు అందించేందుకు మొగ్గు చూపిస్తున్నారు. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ 600 నుంచి 750 మధ్యలో ఉన్నట్లయితే మీకు అధిక వడ్డీల పైన రుణాలను అందిస్తారు. అదే సమయంలో మీకు సిబిల్ స్కోర్ 600 కన్నా తక్కువగా ఉన్నట్లయితే మీ లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకున్నట్లయితే, సిబిల్ స్కోర్ అనేది ఎంత అవసరమో ఇప్పుడు తెలుసుకోవచ్చు.

మీకు ఎప్పుడైనా అత్యవసర రుణం అవసరమైతే ఇది త్వరగా, సులభంగా ఆమోదం పొందాలంటే మంచి క్రెడిట్ స్కోరు అవసరం. ఆర్థిక క్రమశిక్షణకు సిబిల్ స్కోరు ఒక ప్రమాణం. అంతే కాదు తక్కువ వడ్డీ రేటుతో పాటు. మెరుగైన నిబంధనలతో రుణాలు, క్రెడిట్ కార్డులను పొందడానికి కూడా మీకు సహాయపడుతుంది.

అయితే మీరు లోన్ కోసం అప్లై చేసుకున్నప్పుడు ఒకటికి రెండుసార్లు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకున్నట్లయితే అది మీ స్కోర్ ను దెబ్బతీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. సిబిల్ స్కోర్ కోసం మీరు చెక్ చేసుకున్నట్లయితే బ్యాంకులు ఒకటికి రెండు సార్లు నీ స్కోరును విశ్లేషిస్తుంటాయి. ఇలా చేయడం వల్ల మీ స్కోరు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు లోన్ పొందే ఛాన్సెస్ తగ్గిపోతుంటాయి.

దీన్ని ఎలా నివారించాలి?

బ్యాంకులు సిబిల్ స్కోరు చెక్ చేసినప్పుడల్లా సాధారణంగా క్రెడిట్ స్కోరు తగ్గుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దీనికి బదులుగా సిబిల్ స్కోర్ సాఫ్ట్ ఎంక్వైరీ చేయడం ద్వారా అది సాధారణంగా స్కోర్‌పై ఎటువంటి ప్రభావాన్ని చూపదు.

క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడకుండా ఎలా నివారించాలి?

తక్కువ సమయంలో మల్టిపుల్ లోన్స్ లేదా క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడం మానుకోవాలి. రుణదాతలను నేరుగా సంప్రదించే బదులు నమ్మకమైన ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి మీ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేయడానికి ప్రయత్నించండి. రుణదాతలతో నమ్మకాన్ని పెంచుకోవడానికి, ఇప్పటికే ఉన్న రుణాలపై మంచి రుణ తిరిగి చెల్లింపు చరిత్రను నిర్మించుకోవాలి. సిబిల్ స్కోర్ ను పెంచుకునేందుకు మీరు ఎప్పటికప్పుడు క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లిస్తూ ఉండాలి. . అలాగే ఈఎంఐలను కూడా చెల్లిస్తూ ఉండాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories