Apple Card: లేట్ పేమెంట్స్‌పై జరిమానా ఉండదు.. యాపిల్ క్రెడిట్ కార్డుతో అదిరిపోయే బెనిఫిట్స్.. భారత్‌లో విడుదలకు సిద్ధం..!

Apple May Launch Its Co Branded Credit Card With HDFC  In India No Penalty on Late Payments Check Benefits
x

Apple Card: లేట్ పేమెంట్స్‌పై జరిమానా ఉండదు.. యాపిల్ క్రెడిట్ కార్డుతో అదిరిపోయే బెనిఫిట్స్.. భారత్‌లో విడుదలకు సిద్ధం..!

Highlights

Apple Credit Card: టెక్ కంపెనీ యాపిల్ తన తొలి క్రెడిట్ కార్డ్ 'యాపిల్ కార్డ్'ను త్వరలో భారత్‌లో విడుదల చేయనుంది.

Apple Credit Card: టెక్ కంపెనీ యాపిల్ తన తొలి క్రెడిట్ కార్డ్ 'యాపిల్ కార్డ్'ను త్వరలో భారత్‌లో విడుదల చేయనుంది. భారతదేశంలో తన క్రెడిట్ కార్డ్‌ను పరిచయం చేయడానికి HDFC బ్యాంక్‌తో భాగస్వామి కావాలని యోచిస్తున్నట్లు మనీకంట్రోల్ పేర్కొంది. ఇది కంపెనీ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అవుతుంది. అయితే, ఇప్పటి వరకు దీని గురించి ఆపిల్ లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికారిక సమాచారం ఇవ్వలేదు.

మీడియా నివేదికల ప్రకారం, ఆపిల్ సీఈఓ

టిమ్ కుక్ ఏప్రిల్‌లో భారతదేశ పర్యటన సందర్భంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఈవో, ఎండీ శశిధర్ జగదీషన్‌ను కలిశారు.

ఆలస్య చెల్లింపు రుసుములను వసూలు చేయరంట..

అమెరికాలో, కార్డ్ హోల్డర్ల నుంచి గడవు దాటిన పేమెంట్లకు కంపెనీ ఎటువంటి ఆలస్య రుసుమును వసూలు చేయడం లేదంట. భారతదేశంలో కూడా, బకాయి బిల్లులను ఆలస్యంగా చెల్లించినందుకు కంపెనీ ఎలాంటి ఫీజులు వసూలు చేయదని చెబుతున్నారు. అయితే, కార్డు వినియోగదారులు తమ బకాయి చెల్లింపులపై వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటు, ఈ కార్డ్ ద్వారా చెల్లించడం ద్వారా ఆపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా కంపెనీ క్యాష్‌బ్యాక్, తక్షణ తగ్గింపును అందిస్తుందంట.

ఆర్‌బీఐతోనూ యాపిల్ చర్చలు..

యాపిల్ అధికారులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)తో కూడా కార్డు గురించి చర్చించారంట. కార్డ్ కోసం నిర్దేశించిన విధానాన్ని అనుసరించాలని ఆర్‌బీఐ ఆపిల్‌ను కోరింది. భారతదేశానికి క్రెడిట్ కార్డులను తీసుకురావడానికి ఆపిల్‌కు ప్రత్యేక పంపిణీని ఇవ్వబోమని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది.

Apple ప్రస్తుతం USలో మాత్రమే క్రెడిట్ కార్డ్‌లను జారీ చేస్తుంది..

Apple ప్రస్తుతం USలో మాత్రమే క్రెడిట్ కార్డ్‌లను జారీ చేస్తుంది. గోల్డ్‌మన్ సాచ్స్, మాస్టర్‌కార్డ్ సంయుక్త భాగస్వామ్యంతో కంపెనీ ప్రారంభించబడింది.

అమెజాన్-శామ్‌సంగ్‌తో సహా ఇతర టెక్ కంపెనీలు కూడా..

అమెజాన్, శామ్‌సంగ్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు చెల్లింపు రంగంలో తమ వ్యాపారాన్ని పెంచుకుంటున్న తరుణంలో భారతదేశంలో ఆపిల్ కార్డ్ లాంచ్ గురించి వార్తలు వచ్చాయి. ఈ మూడు కంపెనీలు తమ తమ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను భారతదేశంలో ఇప్పటికే ప్రారంభించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories