Tata Group: సైరస్‌ మిస్త్రీ ప్రమాద ఘటన.. ప్రతిజ్ఞ చేసిన ఆనంద్‌ మహీంద్రా..

Tata Group: బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతిచెందారు.

Arun Chilukuri
Published on: 5 Sept 2022 3:48 PM IST
Anand Mahindras Pledge After Cyrus Mistrys Car Accident
X

Tata Group: సైరస్‌ మిస్త్రీ ప్రమాద ఘటన.. ప్రతిజ్ఞ చేసిన ఆనంద్‌ మహీంద్రా..

Tata Group: బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతిచెందారు. నిన్న ముంబై దగ్గర్లోని ఫాల్ఘర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మిస్త్రీ కన్నుమూశారు. ఆయ‌న మృతిపై దేశం సంతాపం వ్యక్తం చేస్తోంది. ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించిన తీరుతో మితిమీరినవేగం, సీట్‌ బెల్ట్‌ పెట్టుకోకవడం తదితర అంశాలు మరోసారి తీవ్ర చర్చకు దారి తీసాయి. ముఖ్యంగా పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా భావోద్వేగ పోస్ట్‌ పెట్టారు.

'నేను కారులో ఏ సీట్లో కూర్చున్నా సీటు బెల్టు ధ‌రిస్తాన‌ని ప్ర‌తిజ్ఞ చేస్తున్నా..మీరుకూడా ప్ర‌తిజ్ఞ చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నా..మ‌నమంద‌రం మ‌న కుటుంబాల‌కు రుణ‌ప‌డి ఉన్నాం.' అని ట్వీట్ చేశారు. చాలామంది ట్విట‌ర్ వినియోగ‌దారులు దీనిపై సానుకూలంగా స్పందించారు. తాము కూడా ప్ర‌తిజ్ఙ చేస్తున్నామ‌ని చెప్పారు. డ్రైవింగ్ చేసేటప్పుడు అన్ని భద్రతా నియమాలను పాటిస్తామ‌ని కామెంట్ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story