Amazon: కస్టమర్లకు అలర్ట్.. రూ.2000 నోటు విషయంలో అమెజాన్‌ కీలక నిర్ణయం..!

Amazon Wont Accept₹2,000 Notes for Cash on Delivery Services From This Date
x

Amazon: కస్టమర్లకు అలర్ట్.. రూ.2000 నోటు విషయంలో అమెజాన్‌ కీలక నిర్ణయం..!

Highlights

Amazon: రెండు వేల నోటుకు సంబంధించి అమెజాన్‌ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది.

Amazon: రెండు వేల నోటుకు సంబంధించి అమెజాన్‌ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీ (COD) సేవలపై 2000 నోట్లను అంగీకరించడాన్ని ఇకపై నిలిపివేయనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా అమెజాన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. క్యాష్ ఆన్ డెలివరీ పేమెంట్స్‌, క్యాష్‌ లోడ్స్‌ కోసం రూ.2,000 నోట్లను ఉపయోగించడం, దానికి సంబంధించిన వివరాలను ఫ్రీక్వెంట్లీ ఆస్క్‌డ్‌ క్వశ్చన్స్‌(FAQ) సెక్షన్‌లో అమెజాన్ స్పష్టం చేసింది.

సెప్టెంబరు 19 నుంచి ‘క్యాష్‌ ఆన్‌ డెలివరీ (COD)’ల చెల్లింపులకు రూ.2,000 నోట్లను స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఈ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడంగానీ లేదా మార్చుకునేందుకుగానీ సెప్టెంబరు 30 వరకు సమయం ఉన్న విషయం తెలిసిందే. ఒకవేళ మీ వద్ద ఇంకా రూ.2000 నోట్లు ఉన్నట్లయితే, సమీపంలోని బ్యాంకులో సెప్టెంబర్ 30, 2023లోపు మార్చుకోవాలి లేదా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఉపసంహరణ ప్రకటన వెలువడిన 20 రోజుల్లోనే చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 50శాతం బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు ఆర్‌బీఐ పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories