Amazon: 23న అమెజాన్ ప్రైమ్ డే సేల్.. కళ్లు చెదిరే ఆఫర్లు.. మొబైల్స్‌పై భారీ తగ్గింపు..!

Amazon Prime Day Sale 2022 Offers
x

Amazon: 23న అమెజాన్ ప్రైమ్ డే సేల్.. కళ్లు చెదిరే ఆఫర్లు.. మొబైల్స్‌పై భారీ తగ్గింపు..!

Highlights

Amazon Prime Day 2022 Sale: స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు దారులకు శుభవార్త.

Amazon Prime Day 2022 Sale: స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు దారులకు శుభవార్త. జులై 23 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ ప్రారంభం కానుంది. జులై 23 నుంచి 24 వ‌ర‌కూ సేల్ ఆఫ‌ర్ అమలు కానుండ‌గా స్మార్ట్‌పోన్లు, టీడ‌బ్ల్యూఎస్ ఇయ‌ర్‌బ‌డ్స్‌, ల్యాప్‌టాప్‌లు వంటి ప‌లు గ్యాడ్జెట్లు, ఉత్ప‌త్తుల‌పై క‌స్ట‌మ‌ర్ల‌కు భారీ డిస్కౌంట్ ఆపర్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ సేల్ టైమ్‌లో కొన్ని ఐఫోన్ మోడల్స్‌పై కస్టమర్లు రూ.20,000 వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు. ఈ సేల్‌లో అనేక రకాల బ్రాండ్స్ మొబైల్ ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్ పొందే వీలుంది. మొబైల్ ఫోన్స్, గాడ్జెట్స్ 40 శాతం వరకు తగ్గింపుతో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఇందులో వినియోగదారులకు నో కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. బడ్జెట్ మొబైల్ ఫోన్‌ల నుండి ఫీచర్ మొబైల్ ఫోన్‌ల వరకు, బెస్ట్ సెల్లర్ మొబైల్ ఫోన్‌లు కూడా చాలా డిస్కౌంట్ ధరల సేల్‌లో అందుబాటులో ఉంటాయి. Samsung, Xiaomi, OnePlus, iQOO, Apple వంటి స్మార్ట్‌ఫోన్‌లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories