Amazon Flipkart: వచ్చేస్తున్నాయ్.. పండుగ ఆఫర్లు, డిస్కౌంట్లు..!

Amazon Flipkart: వచ్చేస్తున్నాయ్.. పండుగ ఆఫర్లు, డిస్కౌంట్లు..!

Rama Rao
Updated on: 7 Sept 2022 8:01 PM IST
Amazon Great Indian Festival Sale 2022 And Flipkart Big Billion Days
X

Amazon Flipkart: వచ్చేస్తున్నాయ్.. పండుగ ఆఫర్లు, డిస్కౌంట్లు..!

Amazon Flipkart: రానున్న రోజుల్లో వరుసగా బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలు వచ్చేస్తున్నాయి. దీంతో ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలైన అమెజాన్, ప్లిప్‌కార్ట్.. కొత్త కొత్త ఆఫర్లు, డిస్కౌంట్లకి సిద్దమయ్యాయి. ఈ నెలఖరులోపు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Great Indian Festival) అలాగే ప్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరిట ఆఫర్లు ప్రకటించనున్నాయి. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, హెడ్‌ఫోన్స్, స్మార్ట్ టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లతో పాటు చాలా ప్రొడక్టులపై మంచి డిస్కౌంట్లు ఉండనున్నాయి. బ్యాంక్ కార్డ్ ఆఫర్ ద్వారా అదనపు తగ్గింపు పొందవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాలు కూడా ఉంటాయి.

అమెజాన్‌ సేల్‌లో ఫోన్స్, గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్‌తో పాటు చాలా ప్రొడక్టులపై డిస్కౌంట్లు, కార్డ్ ఆఫర్లు, డీల్స్ ఉంటాయి. అయితే తేదీలను ఇంకా వెల్లడించలేదు. అయితే మరో రెండు వారాల్లోనే ఈ సేల్ ఉంటుంది. మరో మూడునాలుగు రోజుల్లో సేల్‌ తేదీలను అమెజాన్ ప్రకటించొచ్చు. ఇప్పటికే సేల్‌ సంబంధించి వెబ్‌సైట్‌లో ప్రత్యేకమైన పేజీని క్రియేట్ చేసి కొన్ని డీల్స్, డిస్కౌంట్లను అమెజాన్ టీజ్ చేస్తోంది. ఎస్‌బీఐ (SBI) డెబిట్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. రూ.1,500 వరకు ఎక్స్‌ట్రా తగ్గింపు పొందవచ్చు. ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్న వారికి ప్రత్యేకమైన డీల్స్, ఆఫర్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

బిగ్ బిలియన్ డేస్‌కి సంబంధించి ప్లిప్‌కార్ట్‌ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు సేల్‌ ఉంటుందని చెబుతున్నారు. తేదీలు మాత్రం స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఈ సేల్‌లో ఐసీఐసీఐ, యాక్సిస్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ లభించనుంది. ఈ రెండు ఈ-కామర్స్ సంస్థలు పోటీపడి ఆఫర్లని ప్రకటించడం విశేషం.

Rama Rao

Rama Rao

Next Story