LIC Alert: ఎల్‌ఐసీ పాలసీదారులకి అలర్ట్‌.. ఈ విషయాలు గుర్తించండి లేదంటే నష్టపోతారు..!

Alert to LIC Policy Holders Keep These Things in Mind in Case of KYC
x

LIC Alert: ఎల్‌ఐసీ పాలసీదారులకి అలర్ట్‌.. ఈ విషయాలు గుర్తించండి లేదంటే నష్టపోతారు..!

Highlights

LIC Alert: మీరు ఎల్‌ఐసీ కస్టమర్‌ అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోండి.

LIC Alert: మీరు ఎల్‌ఐసీ కస్టమర్‌ అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోండి. లేదంటే పెద్ద ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆన్‌లైన్ లావాదేవీల ట్రెండ్‌ని దృష్టిలో ఉంచుకుని మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. కొత్త కొత్త మార్గాలలో మోసాలకు తెగబడుతున్నారు. ఇప్పుడు ఎల్‌ఐసీ కస్టమర్లని టార్గెట్ చేశారు. KYCని అప్‌డేట్ చేయమని మెస్సేజ్‌లు పంపుతూ వివరాలు సేకరించి మోసాలకి పాల్పడుతున్నారు.

సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం కస్టమర్లకు ఫేక్ మెసేజ్‌లు పంపుతున్నారని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. KYCని తక్షణమే పూర్తి చేయాలని లేదంటే వినియోగదారులపై జరిమానా విధిస్తామని మెస్సేజ్‌లో ద్వారా బెదిరిస్తున్నారు. వాస్తవానికి ఎల్‌ఐసీ వినియోగదారులకు అలాంటి మెస్సేజ్‌లు ఎప్పుడు పంపదు. అంతేకాదు KYCని అప్‌డేట్ చేయకున్నా ఎటువంటి జరిమానా విధించదు.

అయితే వినియోగదారులను అప్రమత్తం చేస్తూ.. అలాంటి మెస్సేజ్‌లని నమ్మవద్దని ఎల్‌ఐసి తెలిపింది. కస్టమర్‌లు అటువంటి మెస్సేజ్‌లకి రెస్పాండ్‌ కాకూడదని, అలాంటి డేంజర్‌ లింక్‌ని ఓపెన్‌ చేయకూడదని హెచ్చరించింది. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఇటువంటి మెస్సేజ్‌లకి దూరంగా ఉండాలని సూచించింది. ఒకవేళ మీకు అనుమానం వస్తే దగ్గరలోని బ్రాంచ్‌ని సందర్శించాలని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories