Bank Customers: బ్యాంకు ఖాతాదారులకి అలర్ట్‌.. స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు క్లోజ్‌ అవుతున్నాయి..!

Alert to Bank Customers Special Fixed Deposits are Closing
x

Bank Customers: బ్యాంకు ఖాతాదారులకి అలర్ట్‌.. స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు క్లోజ్‌ అవుతున్నాయి..!

Highlights

Bank Customers: ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ చాలా లాభదాయకంగా ఉంటుంది.

Bank Customers: ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ చాలా లాభదాయకంగా ఉంటుంది. అయితే ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఇంకా 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రత్యేక ఫిక్సెడ్ డిపాజిట్ (FD) అనేది కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందించే ఒక రకమైన పెట్టుబడి ఎంపిక. ఇందులో సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే ఎక్కువ వడ్డీ రేటును చెల్లిస్తారు. అయితే కొన్ని నిబంధనలు, షరతులు ఉంటాయని గుర్తుంచుకోండి.

కోవిడ్-19 సమయంలో కొన్ని బ్యాంకులు సీనియర్ సిటిజన్‌ల కోసం ప్రత్యేక FD పథకాలను ప్రవేశపెట్టాయి. ఇవి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 50 bps అధిక వడ్డీ రేట్లని అందించాయి. IDBI బ్యాంక్ తన "IDBI నమన్ సీనియర్ సిటిజన్ డిపాజిట్" పథకాన్ని ఏప్రిల్ 20, 2022న ప్రారంభించింది. ఇది మార్చి 31, 2023న ముగుస్తుంది. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్‌లకు ప్రత్యేక ప్రయోజనం 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది.

IDBI నమన్ సీనియర్ సిటిజన్ డిపాజిట్ పథకం కింద సీనియర్ సిటిజన్‌లు 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం (444 రోజులు, 700 రోజులు మినహా) 7.50% వడ్డీ రేటును పొందుతారు. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కాలానికి 7.25%, 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాలానికి 7.00% వరకు వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేట్లు మార్చి 31, 2023 వరకు వర్తించే ప్రామాణిక రేట్ల కంటే 75 bps ఎక్కువగా ఉంటాయి.

దేశంలోని అతిపెద్ద రుణదాతలు ఎస్బీఐ, HDFC బ్యాంక్ కూడా మార్చి 31, 2023న సీనియర్ సిటిజన్‌ల ప్రత్యేక ఎఫ్డీలని క్లోజ్‌ చేస్తుంది. HDFC బ్యాంక్ మే 2020లో "సీనియర్ సిటిజన్ కేర్ FD"ని ప్రారంభించింది. అనేక పొడిగింపుల తర్వాత ఈ పథకం మార్చి 31, 2023న ముగుస్తుంది. ఈ పథకం కింద హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 0.25% అదనపు వడ్డీని అందిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories