Alert: ఎల్‌ఐసీ కస్టమర్లకి అలర్ట్.. ఈ పనిచేయకపోతే డబ్బులు పొందలేరు..!

Alert for LIC Customers Policy Lapsed you can Restart it 24 October 2022
x

Alert: ఎల్‌ఐసీ కస్టమర్లకి అలర్ట్.. ఈ పనిచేయకపోతే డబ్బులు పొందలేరు..!

Highlights

LIC Policy Revival: ఎల్‌ఐసీ కస్టమర్లు కచ్చితంగా ఈ విషయాన్ని గమనించాలి.

LIC Policy Revival: ఎల్‌ఐసీ కస్టమర్లు కచ్చితంగా ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు మీ నిలిచిపోయిన పాలసీని పునరుద్దరించే అవకాశం వచ్చింది. ల్యాప్స్ అయిన పాలసీల కోసం కంపెనీ రివైవల్ స్కీమ్ ప్రారంభించింది. దీని కింద మీరు సులువుగా పాత పథకాన్ని ప్రారంభించవచ్చు. LIC నుంచి అందిన సమాచారం ప్రకారం.. మీరు పాత పాలసీని అక్టోబర్ 24 వరకు తిరిగి ప్రారంభించవచ్చు . దీని కోసం ఆలస్యమైన జరిమానా, ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. అప్పుడే మీ పాలసీ తిరిగి ప్రారంభించబడుతుంది.

కొన్ని కారణాల వల్ల ప్రీమియం డిపాజిట్ చేయలేని పాలసీదారుల కోసం LIC ఈ తగ్గింపు ఆఫర్‌ను ప్రారంభించింది. పాలసీదారులు తమ నిలిపివేసిన పాలసీలను పునరుద్ధరించుకోవచ్చని ఎల్‌ఐసీ ట్వీట్ ద్వారా తెలిపింది. LIC ప్రకారం పాలసీదారులకు డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. మీ పాలసీ ప్రీమియం రూ.1 లక్ష లేదా అంతకంటే తక్కువ ఉంటే మీకు ఆలస్య రుసుములో 25% రాయితీ ఉంటుంది. గరిష్ట తగ్గింపు రూ.2,500.

ప్రీమియం రూ. 1 నుంచి 3 లక్షల మధ్య ఉంటే డిస్కౌంట్ మొత్తం రూ.3,000గా నిర్ణయించారు. పాలసీ ప్రీమియం రూ.3 లక్షల కంటే ఎక్కువ ఉంటే దానిపై రూ.3,500 వరకు తగ్గింపు ఉంటుంది. ULIPలు, హై రిస్క్ పాలసీలు మినహా పాలసీదారులు తమ అన్ని పాలసీలను పునరుద్ధరించవచ్చు. అయితే ఇందులో కొన్ని షరతులు ఉన్నాయి. వీరి ప్రీమియం కనీసం 5 సంవత్సరాల క్రితం డిపాజిట్ అయి ఉండాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories