దేశంలో మరోమారు పెరిగిన పెట్రో ధరలు..

* దాదాపు 29 రోజుల తర్వాత పెరిగిన పెట్రోల్ , డీజిల్ ధరలు.. * రోజువారీ ధరల సమీక్షలో భాగంగా రేట్ల సవరణ.. * డిల్లీలో పెట్రోల్ లీటరుకు 26 పైసలు పెంపు..

Sandeep Eggoju
Published on: 6 Jan 2021 10:45 AM IST
దేశంలో మరోమారు పెరిగిన పెట్రో ధరలు..
X

దేశంలో పెట్రో ధరలు మరోమారు పెరిగాయి.దేశంలోని మెట్రో నగరాల్లో దాదాపు 29 రోజుల తరువాత, పెట్రోల్ , డీజిల్ ధరలు పెరిగాయి రోజువారీ ధరల సమీక్షలో భాగంగా చమురు సరఫరా సంస్థలు రేట్లను సవరించాయి ఫలితంగా రాజధాని డిల్లీలో పెట్రోల్ లీటరుకు 26 పైసలు పెరిగి 83 రూపాయల 97 పైసలకు చేరుకోగా, డీజిల్ 25 పైసలు పెరిగి 74రూపాయల 12 పైసలు వద్దకు చేరుకుంది.తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 87రూపాయల 34 పైసలు డీజిల్ ధర లీటర్‌ 80 రూపాయల 88 పైసలు వద్ద కొనసాగుతున్నాయి

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story