వివాహం తర్వాత ఈ స్కీమ్‌లో చేరండి.. కచ్చితమైన లాభాలని పొందండి..!

After Marriage Invest Once in Post Office Monthly Income Scheme get Monthly Interest
x

వివాహం తర్వాత ఈ స్కీమ్‌లో చేరండి.. కచ్చితమైన లాభాలని పొందండి..!

Highlights

Post Office: కష్టపడి సంపాదించిన డబ్బులు సురక్షితమైన పెట్టుబడులలో పెట్టడం వల్ల భద్రంగా ఉంటాయి.

Post Office: కష్టపడి సంపాదించిన డబ్బులు సురక్షితమైన పెట్టుబడులలో పెట్టడం వల్ల భద్రంగా ఉంటాయి. అంతేకాదు హామీతో కూడిన రాబడిని కూడా పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ అందించే మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఈ కోవాలోకే వస్తుంది. ఇందులో మీరు ఒక్కసారి పెట్టుబడి పెడితే హామితో కూడిన రాబడిని పొందవచ్చు. ఖాతా మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. అంటే ఐదేళ్ల తర్వాత మీరు నెలవారీ ఆదాయాన్ని పొందడం ప్రారంభిస్తారు. ఈ పథకం మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఉమ్మడి ఖాతా గరిష్టంగా 9 లక్షల పెట్టుబడి

పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో సింగిల్ లేదా జాయింట్ ఖాతాను ఓపెన్‌ చేయవచ్చు. కనీసం రూ.1,000 పెట్టుబడితో ఖాతా తెరవవచ్చు. మీరు ఒకే ఖాతాలో గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అదే సమయంలో ఉమ్మడి ఖాతాలో రూ.9 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు.

MIS ప్రయోజనాలు

పోస్టాఫీసు ఎంఐఎస్ పథకంలో ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. ఈ ఖాతాపై వచ్చే ఆదాయం ప్రతి సభ్యునికి సమానంగా చెల్లిస్తారు. మీరు ఎప్పుడైనా ఉమ్మడి ఖాతాను ఒకే ఖాతాగా మార్చవచ్చు. అలాగే ఒకే ఖాతాను ఉమ్మడి ఖాతాగా మార్చుకోవచ్చు. ఖాతాలో ఏవైనా మార్పులు చేయాలంటే ఖాతా సభ్యులందరు ఉమ్మడిగా దరఖాస్తు సమర్పించాలి.మెచ్యూరిటీ అంటే ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ ఖాతాని మరో 5-5 సంవత్సరాలకు పొడిగించవచ్చు.

ప్రస్తుత వడ్డీ రేటు తెలుసుకోండి

ఇండియా పోస్ట్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం నెలవారీ ఆదాయ పథకంలో సంవత్సరానికి 6.6% వడ్డీని చెల్లిస్తున్నారు. ఇందులో భారతీయ పౌరులెవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఇందులో డిపాజిట్ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత మాత్రమే మీరు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఈ పథకం నిబంధనల ప్రకారం 'ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల మధ్య డబ్బును విత్‌డ్రా చేస్తే డిపాజిట్ మొత్తంలో 2% తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఖాతా తెరిచిన 3 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీకి ముందు డబ్బును విత్‌డ్రా చేస్తే మీ డిపాజిట్‌లో 1% తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories