Adani Group: దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న బ్రాండ్ అదానీ గ్రూప్..కొత్త నివేదిక

Adani Group
x

Adani Group: దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న బ్రాండ్ అదానీ గ్రూప్..కొత్త నివేదిక

Highlights

Adani Group: ఈ మధ్య ఎక్కడ విన్న అదానీ గ్రూప్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. దేశంలోని ఎన్నో కంపెనీలకు ప్రాజెక్టులను అందిస్తూ టాప్ ప్లేస్‌లో నిలుస్తోంది. అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న భారతీయ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

Adani Group: ఈ మధ్య ఎక్కడ విన్న అదానీ గ్రూప్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. దేశంలోని ఎన్నో కంపెనీలకు ప్రాజెక్టులను అందిస్తూ టాప్ ప్లేస్‌లో నిలుస్తోంది. అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న భారతీయ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అదాని గ్రూప్‌ అభివృద్ధి గురించి మరి కొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో అదానీ గ్రూప్ అత్యంత వేగంగా ఎదుగుతున్న బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా దేశంలో ఎక్కడ విన్నా అదానీ గ్రూప్‌ పేరే వినిపిస్తుంది. ఇంతకీ ఈ గ్రూప్ బ్రాండ్ విలువ ఎంత పెరిగిందో మీకు తెలుసా? దాదాపు 82 శాతం పెరిగింది. లండన్‌కు చెందిన బ్రాండ్ ఫైనాన్స్.. మోస్ట్ వాల్యూబుల్ ఇండియన్ బ్రాండ్స్ 2025 నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, గ్రూప్‌ని అభివృద్ది చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు, సమగ్ర మౌలిక సదుపాయాల దృష్టి, గ్రీన్ అనర్జీ ఆశయాలలో పెరుగుదల వంటి పలు కీలక వాటాదారులలో బ్రాండ్ ఈక్వెటీ పెరుగుదలకు కారణమైందని ఈ నివేదికలో పేర్కొంది.

అదానీ బ్రాండ్ విలువ 2024లో $3.55 బిలియన్ల నుండి $6.46 బిలియన్లకు పెరగడం విశేషం. ఇది ఇప్పుడు $2.91 బిలియన్ల పెరుగుదలను సూచిస్తుంది. ఈ బ్రాండ్ విలువ పెరుగుదల ఆ గ్రూప్ నిబద్దత, స్థిరత్వం, బలానికి నిదర్శమని నేవిదక తెలిపింది. అదాన్ గ్రూప్ బ్రాండ్ విలువ పెరుగుదల 2023లో ఎక్కువగా పెరిగింది. అందుకే ఈ గ్రూప్ 16వ స్థానం నుంచి 13వ స్థానానికి చేరుకుంది. ఈ కంపెనీ రికార్డ్ స్తాయిలో ఆదాయాలు, వృద్ది, లాభాలను సాధించింది.

అదేవిధంగా టాటా గ్రూప్‌ మరోసారి భారతదేశ బ్రాండింగ్ ప్రపంచంలో తనదైన ముద్రను వేసుకుంది. బ్రాండ్ వాల్యుయేషన్ కన్సల్టెన్సీ బ్రాండ్ ఫైనాన్ ఇచ్చిన తాజా వివరాల ప్రకారం, టాటాగ్రూప్ భారతదేశంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా అవతరించింది. ఈ సంవత్సరం దీని బ్రాండ్ విలువ 10% పెరిగింది. అలాగే దేశంలో $30 బిలియన్ల మార్కుని దాటిని మొట్టమొదటి బ్రాండ్‌గా నిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories