Aadhaar PAN Link: జూన్ 30లోపు ఇలా చేయండి.. లేదంటే భారీగా ఫైన్ పడే ఛాన్స్..!

Aadhaar Pan Linkage Before 30 June and Avoid Penalty Check Full Details
x

Aadhaar PAN Link: జూన్ 30లోపు ఇలా చేయండి.. లేదంటే భారీగా ఫైన్ పడే ఛాన్స్..!

Highlights

Aadhaar PAN link: పాన్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయకుంటే, త్వరగా పూర్తి చేయండి. ఎలాంటి పెనాల్టీ లేకుండా పాన్, ఆధార్ లింక్ చేయడానికి గడువు దగ్గరపడింది.

Aadhaar PAN link: పాన్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయకుంటే, త్వరగా పూర్తి చేయండి. ఎలాంటి పెనాల్టీ లేకుండా పాన్, ఆధార్ లింక్ చేయడానికి గడువు దగ్గరపడింది. పెనాల్టీని తప్పించుకోవాలనుకుంటే, జూన్ 30లోపు ఈ పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ గడువును పొడిగించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ముందుగా మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. నిర్ణీత గడువు తర్వాత ఆధార్ కార్డుతో పాన్‌ను లింక్ చేసిన వారిపై ఆదాయపు పన్ను శాఖ రూ. 1000 జరిమానా విధిస్తుంది. చలాన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. UIDAI కూడా పాన్-ఆధార్ లింక్ చేయడానికి వివరణాత్మక విధానాన్ని జారీ చేసింది. పాన్-ఆధార్ లింకింగ్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్రక్రియలు రెండూ UIDAI వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఆధార్ కార్డ్‌తో ఆన్‌లైన్‌లో పాన్‌ను లింక్ చేయడం ఎలా..

పాన్, ఆధార్ లింక్ చేయడానికి ముందుగా ఎకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత లాగిన్ చేయండి. ఆ తర్వాత ID, పాస్ వర్డ్, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేయండి. ఆధార్-పాన్ లింక్‌ను తెలియజేసే పాప్-అప్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయండి. ఆ తర్వాత పాన్‌ను ఆధార్ కార్డ్‌తో విజయవంతంగా లింక్ చేసినట్లు మీకు సమాచారం వస్తుంది.

ఆదాయపు పన్ను వెబ్‌సైట్ incometaxindiaefiling.gov.in/e-Filing/Services/LinkAadhaarHome.htmlవెళ్లాలి.

ఆఫ్‌లైన్‌లో ఎలా లింక్ చేయాంటే..

NSDL లేదా UTITTSL వంటి PAN సర్వీస్ ప్రొవైడర్‌ల సర్వీస్ సెంటర్‌లను సందర్శించాలి.

అనుబంధం-I ఫారమ్‌ను మధ్యలో నింపాలి.

మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ హార్డ్ కాపీతో పాటు ఫారమ్‌ను సమర్పించాలి. నామమాత్రపు రుసుము చెల్లించాలి.

ఆ తర్వాత మీ పాన్, ఆధార్ కార్డ్ లింక్ చేయబడుతుంది.

SMS ద్వారా లింక్ చేయడం ఎలా..

పాన్ కార్డ్‌తో మీ ఆధార్ కార్డ్‌ని లింక్ చేయడానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో 567678 లేదా 56161కి SMS పంపండి.

సందేశాన్ని పంపడానికి UIDPAN <12-అంకెల ఆధార్ నంబర్> <10-అంకెల PAN> అని టైప్ చేయండి.

SMS పంపిన తర్వాత రిప్లై వస్తుంది.

మీ పాన్ కార్డ్‌తో ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి ప్రక్రియ. అయితే, 80 ఏళ్లు పైబడిన వ్యక్తులు, అస్సాం, మేఘాలయ, జమ్మూ, కశ్మీర్ నివాసితులు మినహాయించబడిన కేటగిరీలో ఉన్నందున అలా చేయవలసిన అవసరం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories