Stock Market: శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లకు షాక్

Stock Market: సెన్సెక్స్‌ 885 పాయింట్లు లాస్

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 2 Aug 2024 10:01 PM IST
A shock to Indian stock markets on Friday
X

Stock Market: శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లకు షాక్ 

Stock Market: శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లకు షాక్ తగిలింది. సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ ఏకంగా 885 పాయింట్లు నష్టపోయి 80,981 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా అదే బాటలో 293 పాయింట్ల నష్టంతో 24,717 వద్ద ముగిసింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం, తద్వారా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. దాంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు కూడా కుదుపులకు గురయ్యాయి. మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకోవడంతో.. మదుపర్ల 5లక్షల కోట్ల సంపద ఆవిరి అయింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story