Biryani: స్విగ్గీ డెలివరీ సంస్థనుంచి 3.50 లక్షల బిర్యానీ ప్యాకెట్ల డెలివరీ

Biryani: న్యూ ఇయర్ సందర్భంగా బిర్యానీకోసం వెల్లువెత్తిన ఆర్డర్లు

Jyothi
Updated on: 1 Jan 2023 4:32 PM IST
3.50 Lakh Biryani Orders During the New Year Celebrations
X

Biryani: స్విగ్గీ డెలివరీ సంస్థనుంచి 3.50 లక్షల బిర్యానీ ప్యాకెట్ల డెలివరీ

Biryani: ఆంగ్ల సంవత్సరాదిని స్వాగతిస్తూ బిర్యానీ మస్తుగా ఆరగించారని గణాంకాలు వెల్లడించాయి. అత్యధికులు ఇళ్లవద్దనుంచే స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ సంస్థల ద్వారా ఆర్డర్లిచ్చి తెప్పించుకున్నారు. ఆహార ప్రియులు హైదరాబాద్ బిర్యానీకే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో ఆన్‌లైన్‌ ఆర్డర్లు కుప్పలు తెప్పలుగా నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒక స్విగ్గీ ఫుడ్ డెలివరీ సంస్థ శనివారం ఒక్కరోజే మూడు లక్షల 50 వేల బిర్యానీ ప్యాకెట్లను డెలివరీ చేసినట్లు తెలిపింది. అలాగే రెండు లక్షల యాభైవేల పిజ్జాలను వినియోగదార్లకు అందించినట్లు పేర్కొంది. ఆన్‌లైన్ ఆర్డర్లలో అత్యధిక శాతం హైదరాబాద్ బిర్యానీకే ఆహార ప్రియులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ బిర్యానీకోసం బావర్చీనుంచి నిమిషానికి రెండు బిర్యానీలు డెలివరీ అయ్యాయి.

Jyothi

Jyothi

Next Story