New Rules: జూన్ 1 నుంచి 3 కొత్త రూల్స్.. మీ జేబుకు చిల్లు పడే ఛాన్స్.. అవేంటో తెలుసా?

New Rules: జూన్ 1 నుంచి 3 కొత్త రూల్స్.. మీ జేబుకు చిల్లు పడే ఛాన్స్.. అవేంటో తెలుసా?
x
Highlights

మే నెల పూర్తయ్యి, జూన్ నెల రాబోతోంది. కొత్త నెల ప్రారంభంలో, కొన్ని కొత్త మార్పులు కూడా కనిపిస్తాయి.

మే నెల పూర్తయ్యి, జూన్ నెల రాబోతోంది. కొత్త నెల ప్రారంభంలో, కొన్ని కొత్త మార్పులు కూడా కనిపిస్తాయి. ఇటువంటి పరిస్థితిలో, జూన్‌లో కూడా కొన్ని మార్పులు ఉండబోతున్నాయి. ఇవి మీ జేబు, నెలవారీ బడ్జెట్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

ఎల్పీజీ, సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరల్లో మార్పులు..

ఎల్‌పీబీ, సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలను ప్రతి నెల ప్రారంభంలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రభుత్వ గ్యాస్ కంపెనీలు ఏప్రిల్, మే నెలల్లో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరను నిరంతరం తగ్గించాయి. అయితే 14 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జూన్‌లోనైనా సిలిండర్ల ధరలో మార్పు వస్తుందేమో చూడాలి.

ఎలక్ట్రిక్ బైక్ కొనడం ఖరీదైనది..

జూన్ 1 నుంచి, దేశంలో ఎలక్ట్రిక్ బైక్ కొనడం ఖరీదైనది. మే 21న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై సబ్సిడీని తగ్గించింది. గతంలో ఈ సబ్సిడీ కిలోవాట్ అవర్‌కు 15 వేల రూపాయలు ఉండగా, దాన్ని కిలోవాట్ అవర్‌కు 10 వేల రూపాయలకు తగ్గించారు. ఈ కారణంగా జూన్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కొనుగోలుకు రూ.25-30 వేలు ఖర్చవుతుందని అంచనా.

అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను జూన్ 1 నుంచి తిరిగి ఇవ్వనున్న బ్యాంకులు..

బ్యాంకుల్లో ఉన్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల వారసులను కనుగొనే డ్రైవ్‌ను ఆర్‌బీఐ ప్రకటించింది. దేశంలోని ప్రతి జిల్లాలో 100 రోజులలోపు చేసిన టాప్ 100 డిపాజిట్లను తెలుసుకోవడానికి సెంట్రల్ బ్యాంక్ బ్యాంకుల కోసం '100 దివాస్ 100 పే' ప్రచారాన్ని ప్రారంభించింది. జూన్ 1 నుంచి ప్రచారం ప్రారంభం కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories