New Labor Code: ఉద్యోగులకి గమనిక.. కొత్త కార్మిక చట్టం అమలు ఎప్పటి నుంచంటే..?

3 Days Holiday per Week 48 Hours Work Know When the New Labor Code Will Come Into Force
x

New Labor Code: ఉద్యోగులకి గమనిక.. కొత్త కార్మిక చట్టం అమలు ఎప్పటి నుంచంటే..?

Highlights

New Labor Code: జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులకు మంచి రోజులు రానున్నాయి.

New Labor Code: జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులకు మంచి రోజులు రానున్నాయి. త్వరలో వారంలో మూడు రోజులు సెలవు పొందవచ్చు. అయితే మూడు రోజుల సెలవులతో రిలీఫ్ లభిస్తుండగా మరోవైపు మిగిలిన రోజులో చాలా సేపు ఆఫీసులోనే ఉండాల్సి ఉంటుంది. నిజానికి మీడియాలో జరుగుతున్న వార్తల ప్రకారం ప్రభుత్వం అక్టోబర్ నుంచి కొత్త కార్మిక చట్టాన్ని అమలు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో దీనిని జూలై 1 నుంచి అమలులోకి తీసుకొస్తున్నారని తెలిపారు. కానీ కొన్ని రాష్ట్రాలు ఈ చట్టానికి ఆమోదం తెలపకపోవడంతో పెండింగ్‌లో ఉంది.

లోక్‌సభలో అడిగిన ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ కొత్త కార్మిక చట్టాన్ని వీలైనంత త్వరగా అమలు చేస్తామని రాష్ట్ర మంత్రి రామేశ్వర్ చెప్పారు. అయితే దీని అమలుకు సంబంధించిన తేదీలను ఇంకా ప్రకటించలేదు. అక్టోబరు నుంచి కొత్త కార్మిక చట్టాన్ని అమలు చేయవచ్చని కొన్ని మీడియా కథనాలలో చెబుతున్నారు. కొత్త కార్మిక చట్టం అమలైతే ఉద్యోగులు కూడా కొన్ని మార్పులను ఎదుర్కోవలసి ఉంటుంది.

కొత్త కార్మిక చట్టంతో ఉద్యోగులకు వారంలో మూడు రోజులు సెలవులు వస్తాయి. ఉద్యోగులు వారానికి 48 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు రోజుకు 12 గంటలు, వారానికి నాలుగు రోజులు పని చేయాల్సి ఉంటుంది. అలాగే ఉద్యోగుల పీఎఫ్‌లో కంట్రిబ్యూషన్‌ పెరుగుతుంది. ప్రాథమిక జీతంలో 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ మొత్తం పిఎఫ్‌లో చెల్లించాలి. అంటే ఉద్యోగుల టేక్‌ హోమ్‌ జీతం తగ్గుతుంది. అలాగే మీరు ఉద్యోగం వదిలేస్తే లేదా మీరు తొలగించబడితే మీ డబ్బుకు సంబంధించిన అన్ని ప్రక్రియలు కేవలం 2 రోజుల్లో పరిష్కారమవుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories