Gold, Silver Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం, స్థిరంగా వెండి ధరలు

Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.

Kranthi
Published on: 21 Jun 2021 6:35 AM IST
24 Carat Gold Rate Today 21 06 2021 in Hyderabad Silver Price Today in Vijayawada Amaravathi Delhi
X

Gold, Silver Price Today: (File Image)

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. గత వారం నుంచి బంగారం ధర తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ బులియన్ మార్కెట్‌ ప్రకారం.. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. తాజాగా సోమవారం కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. కొన్ని చోట్ల తగ్గితే.. మరికొన్నిచోట్ల ధరలు స్థిరంగానే ఉన్నాయి. శనివారం 22 క్యారెట్ల తులం బంగారం ధర.. రూ. 46,220 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 47,220 ఉంది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,140 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 50,330 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,220 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 47,220 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,990 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 47,990 వద్ద ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,290 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,290 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,990 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.47,990 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,990 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.47,990 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,990 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 47,990 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు...

ప్రపంచంలో, దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో పెద్దగా మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం తటస్థంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర 67,600 రూపాయల వద్ద కొనసాగుతోంది.

దేశంలో ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 67,600 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 67,600 గా ఉంది. బెంగళూరులో రూ.67,600 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.67,600 వద్ద ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.73,100 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో వెండి కిలో రూ.73,100 లు ఉంది.., విజయవాడలో వెండి రూ.73,100లు వద్ద కొనసాగుతోంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 21-06-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Kranthi

Kranthi

Next Story