Gold, Silver Price Today: దిగివస్తోన్న బంగారం,వెండి ధరలు

Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు దిగివస్తుండగా, వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి.

Kranthi
Published on: 17 Jun 2021 7:14 AM IST
24 Carat Gold Rate Today 17 06 2021 in Hyderabad Silver Price Today in Vijayawada Amaravathi Delhi
X

Gold, Silver Price Today: (File Image)

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.190 మేర తగ్గింది. దేశీయంగా పరిశీలిస్తే ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,410 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,410 ఉంది. అలాగే కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,470 వద్ద కొనసాగుతోంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,470 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,470 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,470 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు...

ప్రపంచంలో, దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. బంగారం ధరలు దిగివస్తుండగా, వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. దేశీయంగా పలు ప్రధాన నగరాల్లో కిలో వెండిపై రూ.250 తగ్గుముఖం పట్టగా, హైదరాబాద్‌లో మాత్రం కిలో వెండిపై రూ.300 వరకు పెరిగింది. .

దేశంలో ప్రధాన నగరాల్లో...

దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,300 ఉండగా, చెన్నైలో రూ.76,200 ఉంది, ముంబైలో కిలో వెండి ధర రూ.71,300 ఉండగా, కోల్‌కతాలో రూ.71,300 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,300 ఉండగా, కేరళలో రూ.71,300 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,200 ఉండగా, విజయవాడలో రూ.76,200 వద్ద కొనసాగుతోంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 17-06-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Kranthi

Kranthi

Next Story