Gold Rate: ఒక్క‌సారిగా పెరిగిన బంగారం ధ‌ర‌.. అదే బాట‌లో వెండి

Gold Rate:బంగారం ధరలు కాస్త పెరిగాయి. వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి

Samba Siva Rao
Published on: 4 May 2021 7:01 AM IST
Gold Rate hyderabad, Vijayawada
X

Gold Rate

Gold Rate: బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. సోమ‌వారం ప్రారంభ‌ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు ( మే 4) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. గ‌త కొన్నిరోజులుగా తగ్గుతూ వ‌స్తున్న బంగారం ఒక్క‌సారిగా పెరిగింది.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. సోమ‌వారం (03.05.2021) బంగారం ధరలు గ‌త‌వారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయలు పెరిగి 44,000 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 220 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 48,000 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు కూడా కొద్దిపాటి పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర సోమ‌వారం నాటి ప్రారంభ ధరల కంటె కాస్త పెరిగాయి. ఈరోజు వెండి ధర కేజీకి 700 రూపాయలు పెరిగింది. దీంతో 73వేల రూపాయల స్థాయికి వెండి ధరలు చేరాయి. దీంతో కేజీ వెండి ధర 73,500 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. మంగ‌ళ‌వారం(04.05.2021) బంగారం ధరలు సోమ‌వారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయలు పెరిగి 44,000 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 220 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 48,000 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో...

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమ‌వారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 220 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 45,570 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా సోమ‌వారం నాటి ధరతో పోలిస్తే 220 రూపాయలు పెరిగింది. దాంతో 49,770 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే.. కేజీ వెండి ధర సో్మ‌వారం నాటి ప్రారంభ ధరల కంటే కాస్త పెరిగింది. ఈరోజు 700 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో67వేల రూపాయల స్థాయికి వెండి ధరలు చేరుకున్నాయి. దీంతో కేజీ వెండి ధర 67,500 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 04-05-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story