Gold, Silver Price Today: తగ్గిన బంగారం, స్వల్పంగా పెరిగిన వెండి ధరలు

Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి.

Kranthi
Published on: 26 Jun 2021 5:58 AM IST
22ct Gold Price Today in Hyderabad 26 06 2021 Silver Rate Today in Vijayawada Delhi Hyderabad Amaravathi
X

Gold, Silver Price Today: (File Image)

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. గత కొంత కాలంగా బంగారం ధర తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ బులియన్ మార్కెట్‌ ప్రకారం.. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. తాజాగా మంగళవారం కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. కొన్ని చోట్ల తగ్గితే.. మరికొన్నిచోట్ల ధరలు స్థిరంగానే ఉన్నాయి. శనివారం బంగారం ధర 100 గ్రాములపై రూ.600 మేర తగ్గింది. దేశంలో 22 క్యారెట్ల తులం (10 గ్రాముల) బంగారం ధర.. రూ. 46,130 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 47,130 గా ఉంది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46,150 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 50,250 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,130 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 47,130 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,000 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,000 వద్ద ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,400 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,000 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.48,000 వద్ద కొనసాగుతుండగా, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,000 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.48,000 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,000 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

వెండి ధరలు...

ప్రపంచంలో, దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం ధర తగ్గగా, వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. శనివారం ప్రస్తుతం కిలో వెండి ధర 68,300 రూపాయల వద్ద కొనసాగుతోంది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 68,300 గా వద్ద కొనసాగుతోంది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 68,300 గా ఉండగా, బెంగళూరులో రూ.68,300 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.68,300 వద్ద ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.73,400 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో కిలో వెండి రూ.73,400 లుగా ఉండగా. విజయవాడలో వెండి రూ.73,400 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో వెండి రూ.73,400 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 26-06-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Kranthi

Kranthi

Next Story