Gold, Silver Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర

Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరగ్గా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం తగ్గుదల కనిపిస్తోంది.

Kranthi
Updated on: 15 Jun 2021 9:14 AM IST
22ct Gold Price Today in Hyderabad 15 06 2021 Silver Rate Today in Vijayawada Delhi Hyderabad Amaravathi
X

Gold, Silver Price Today: (File Image)

Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. అయితే మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం పసిడి 10 గ్రాముల ధరపై స్వల్పంగా రూ.30 తగ్గింది. కానీ తెలుగు రాష్ట్రాలైన ఏపీ , తెలంగాణలో మాత్రం రూ.240 వరకు తగ్గింది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,760 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,770 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640 వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640 ఉంది

వెండి ధరలు...

ప్రపంచంలో, దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా, వెండి ధరలు మాత్రం తగ్గాయి. దేశీయంగా 400 రూపాయల వరకు తగ్గితే హైదరాబాద్‌లో మాత్రం 800 రూపాయల వరకు తగ్గింది.

దేశంలో ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,900 ఉండగా, చెన్నైలో రూ.76,500 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.71,900 ఉండగా, కోల్‌కతాలో రూ.71,900 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,900 ఉండగా, కేరళలో రూ.71,900 ఉంది. అలాగే

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,500 ఉండగా, విజయవాడలో రూ.76,500వద్ద కొనసాగుతోంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 15-06-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Kranthi

Kranthi

Next Story