Gold, Silver Price Today: బంగారం, వెండి ధరలు నేడు స్థిరంగా వున్నప్పటీ...పెరిగే అవకాశాలే ఎక్కువంట!

Gold, Silver Price Today: బంగారం, వెండి ధరలు నేడు స్థిరంగా కొనసాగుతూ వున్నప్పటికీ పెరిగే అవకాశాలు ఎక్కువగా వున్నాయని నిపుణుల అంచనా

Kranthi
Published on: 12 July 2021 6:49 AM IST
22ct Gold Price Today in Hyderabad 12 07 2021 Silver Rate Today in Vijayawada Delhi Hyderabad Amaravathi
X

Gold, Silver Price Today: (File Image)

Gold Price Today: గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తుండగా నేడు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టి కొంత వెసులు బాటు కలిగిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. తాజాగా అంతర్జాతీయ, దేశీయ పరిస్థితులను బట్టీ... బంగారం ధరలు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని... స్టాక్ మార్కె్ట్లు నష్టాల బాట పట్టేలా కనిపిస్తున్నాయని నిపుణులు అంచానా వేస్తున్నారు. తాజాగా బంగారం ధరల్లో మార్పులేమీ చోటుచేసుకోలేదు. దేశంలో స్థిరంగానే కొనసాగుతున్నాయి. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.44,750 ఉంది. పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.48,820 ఉంది

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 46,900గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 50,950ల వద్ద ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైయ్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 46,810 వద్ద కొనసాగుతుండగా 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 47,810గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం రూ. 45,260గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,380గా నమోదైంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 44,750 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,820గా ట్రేడ్ అవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,750గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,820 వద్ద ఉండగా, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,750 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,820 లు ట్రేడ్ అవుతోంది. శాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 44,750 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,820గా కొనసాగుతోంది.

వెండి ధరలు...

ప్రపంచంలో, దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కామన్ అయిపోయాయి. నేడు బంగారం ధరలు స్థిరంగా వుండగా వెండి ధరలు అదే బాటలో పయనిస్తున్నాయి. తాజాగా ఇక వెండి ధరల్లో కూడా దేశీయంగా రూ.500లు పెరిగి కేజీ వెండి ధర... రూ.74,100 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 69,300 వద్ద కొనసాగుతోంది. ఆర్థిక రాజధాని ముంబయిలోనూ కిలో వెండి ధర రూ. 69,300గా నమోదైంది.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 74,100గా ఉంది. బెంగళూరులో కిలో వెండి రూ. 69,300గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 74,100గా ఉండగా, విజయవాడలో వెండి రూ. 74,100 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. 74,100ల వద్ద కొనసాగుతోంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 12-07-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Kranthi

Kranthi

Next Story