Gold, Silver Price Today: తగ్గిన బంగారం, వెండి ధరలు

22ct Gold Price Today in Hyderabad 08 06 2021 Silver Rate Today in Vijayawada Delhi Hyderabad Amaravathi
x

Gold, Silver Price Today: (File Image)

Highlights

Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి., వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది.

Gold Price Today: బంగారం ధరలు అంతర్జాతీయంగా కూడా తగ్గుతున్నాయి. రూపాయితో పోల్చితే... డాలర్ బలహీనపడుతోంది. గత కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతో బంగారం ధరలు దిగి వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. ఈ రోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. తాజాగా బంగారం ధరలపై రూ.800లు తగ్గింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెరిగింది. మంగళవారం 22 క్యారెట్ల తులం బంగారం.. రూ.47,510 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 48,510 గా ఉంది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.840 మేర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు 47,950 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ పది గ్రాములపై 1040 పెరిగి.. ధర 52,300 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,510 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,510 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,800 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,970 వద్ద ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 46,050 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,240 వద్ద వుంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,800 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.49,970 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,800 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.49,970 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,800 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,970 వద్ద ట్రేడ్ అవుతోంది.

వెండి ధరలు...

ప్రపంచంలో, దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. కాగా తాజాగా.. మంగళవారం వెండి ధరలు స్వల్ప మార్పులు కనిపించాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండికి 600 రూపాయలు తగ్గింది. దీంతో కిలో వెండి ధర 71,000 రూపాయలు ఉంది.

దేశంలో ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,000 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 71,000 గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.75,800 గా ఉంది. ఇక్కడ రికార్డు స్థాయిలో ధర కొనసాగుతోంది. బెంగళూరులో రూ.71,000 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.71,000 వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో వెండి కిలో రూ.75,800 లు ఉంది. విజయవాడలో వెండి రూ.75,800 లు కొనసాగుతోంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 08-06-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories