Gold, Silver Price Today: రోజు రోజుకి షాకిస్తోన్న బంగారం ధరలు

Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. తాజాగా 10 గ్రాములపై 100 రూపాయలు పెరిగింది.

Kranthi
Updated on: 4 Jun 2021 7:24 AM IST
22ct Gold Price Today in Hyderabad 04 06 2021 Silver Rate Today in Vijayawada Delhi Hyderabad Amaravathi
X

Gold, Silver Price Today: (File Image)

Gold Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరిగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. తాజాగా 10 గ్రాములపై 100 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం 50వేలకుపైగా చేరిన పసిడి.. మున్ముందు మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,350 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,790 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,230 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,230 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,450 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,200 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 వద్ద ట్రేడ్ అవుతోంది.

వెండి ధరలు...

దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు జరుగుతుంటాయి. ఒకవైపు బంగారం ధరలు పెరుగుతుండగా వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,000 ఉండగా, చెన్నైలో రూ.77,500 ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.72,000 ఉండగా, కోల్‌కతాలో రూ.72,000 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,000 ఉండగా, కేరళలో రూ.72,000 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,500 ఉండగా, విజయవాడలో రూ.77,500 ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 04-06-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Kranthi

Kranthi

Next Story