Sundar Pichai: గూగుల్‌తో 20 ఏళ్ల బంధం.. ఎమోషనల్‌ పోస్ట్‌ చేసిన సుందర్‌ పిచాయ్‌

Sundar Pichai: ఉద్యోగిగా చేరి సంస్థ సీఈవో వరకు ఎదిగిన సుందర్ పిచాయ్

Shashank Gullapelli
Published on: 27 April 2024 4:33 PM IST
20-year Relationship With Google Sundar Pichai Made An Emotional Post
X

Sundar Pichai: గూగుల్‌తో 20 ఏళ్ల బంధం.. ఎమోషనల్‌ పోస్ట్‌ చేసిన సుందర్‌ పిచాయ్‌

Sundar Pichai: గూగుల్‌లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఉద్యోగిగా చేరి దానిని నడిపించే స్థాయికి ఎదిగారు సుందర్ పిచాయ్. ఈ 20 ఏళ్లలో తన జుట్టు సైతం మారిందని ట్వీట్ చేశారు. గూగుల్‌లో తాను చేరినప్పటి నుంచి ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. ఈ 20 ఏళ్లలో మారని ఒకే అంశం పనిచేస్తున్నప్పుడు పొందే థ్రిల్ అంటూ రాసుకొచ్చారు. 2004లో ప్రొడక్ట్ మేనేజర్‌గా చేరిన నాటిది, ప్రస్తుత ఐడీ కార్డును పంచుకున్నారు. మీ జుట్టు తగ్గింది.. గూగుల్ ఆదాయం పెరిగిందని నెటిజన్లు కొందరు చమత్కరించారు. మీరు నా రోల్‌ మోడల్‌ సర్ అంటూ మరికొందరు పోస్టులు పెట్టారు.


Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story