నిలకడగా బంగారం ధరలు.. మార్పులు లేని వెండి!

నిలకడగా బంగారం ధరలు.. మార్పులు లేని వెండి!
x
Highlights

gold-rates-today-21-12-2019-gold-rates-dropped-silver-rates-gold-rates-hyderabad-delhi-vijayawada

నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. శనివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 39,580 రూపాయల వద్ద నిలింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 36,280రూపాయల వద్ద నిలకడగా ఉంది. కాగా, వెండి ధర కూడా మార్పులు లేకుండా ఉంది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 46,850 రూపాయల వద్ద నిలిచింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,580 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,280 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 50 రూపాయలు తగ్గింది. దీంతో 38,250 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50 రూపాయల తగ్గుదల నమోదు చేసి 37,500 రూపాయలయింది. ఇక వెండి ధర ఇక్కడా స్థిరంగా ఉంది. దీంతో వెండి కేజీకి 46,850 రూపాయల వద్ద నిలకడగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 21.12.2019 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


Show Full Article
Print Article
Next Story
More Stories