Train Tragedy: ఒడిసా రైలు ప్రమాదం పై సినీ నటుల దిగ్ర్భాంతి. చిరంజీవి, పవన్, ఎన్టీఆర్, అనుష్క, కమల్ హాసన్

Train Tragedy: ఒడిసా రైలు ప్రమాదం పై సినీ నటుల దిగ్ర్భాంతి. చిరంజీవి, పవన్, ఎన్టీఆర్, అనుష్క, కమల్ హాసన్
x

Train Tragedy: ఒడిసా రైలు ప్రమాదం పై సినీ నటుల దిగ్ర్భాంతి. చిరంజీవి, పవన్, ఎన్టీఆర్, అనుష్క, కమల్ హాసన్

Highlights

కోరమండల్ రైలు ప్రమాద ఘటనపై సినీ ప్రముఖులు పలువురు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా ప్రమాద మృతుల కుటుంబాలకు తమ సానుభూతి తెలియజేశారు. ప్రమాద బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

Train Tragedy: ఒడిశా రైలు ప్రమాద ఘటన యావత్ దేశాన్ని షాక్ కు గురి చేసింది. పశ్చిమబెంగాల్ లోని షాలిమార్ నుంచి చెన్నై సెంట్రల్ కు బయల్దేరిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి గూడ్స్ రైలును ఢీ కొట్టింది. కోల్ కతాకు దక్షిణాన 250 కిలోమీటర్ల దూరంలో, భువనేశ్వర్ కు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాసోర్ జిల్లాలోని బహనాగ బజార్ స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ పెను విషాదకర ఘటనలో 278మంది చనిపోగా 900మందకి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రధాని మోదీ సంతాపం:

ప్రధాని మోదీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రమాద ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేయడంతో పాటు సహాయక చర్యలకు ఆదేశించారు. ప్రధాని మోదీ ప్రమాదస్థలిని సందర్శించేందుకు బయల్దేరారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం సహాయకచర్యలకు ఆదేశించారు. ప్రమాదానికి గురైన కోరమండాల్ ఎక్స్ ప్రెస్ రైలులో ఏపీకి చెందిన ౧౭౮ మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. వందమందికి పైగా విశాఖకు రిజర్వేషన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి మూడు రైళ్లు ఢీకొనడంతో ప్రమాదస్థాయి ఎక్కువగా ఉంది.

టాలీవుడ్ స్పందన:

రైలు ప్రమాద ఘటనపై సినీ ప్రముఖులు పలువురు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా ప్రమాద మృతుల కుటుంబాలకు తమ సానుభూతి తెలియజేశారు. ప్రమాద బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ప్రమాద వార్త దిగ్ర్భాంతికి గురి చేసిందని మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు అల్లుఅర్జున్ తన సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ప్రమాద ఘటన ఎంతో దురదృష్టకరమంటూ జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేశారు. దుర్ఘటనలో మృత్యువాతపడడం దురదృష్టకరమని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత ప్రయాణీకులు, వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. చిరంజీవి సైతం ప్రమాద ఘటనపై స్పందించారు. ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులను రక్షించేందుకు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని తన ఫ్యాన్స్ కు అలాగే మానవవతావాదులకు చిరు పిలుపునిచ్చారు. అనుష్క శెట్టి సైతం తన సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బాధిత కుటుంబాలకు తన విచారాన్ని తెలియజేశారు. సాయిధరమ్ తేజ్, నిఖిల్ వంటి యువ నటులు సైతం విచారం వ్యక్తం చేశారు.

బాలీవుడ్ విచారం:

బాలీవుడ్ నటీనటులు సైతం రైలు ప్రమాదం పై స్పందించారు. ప్రమాదం వార్త తనను కలిచివేసిందని నటుడు సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు. బాధితులు త్వరగా కోలుకునేలా భగవంతుడు ఆత్మస్థైర్యం ప్రసాదించాలని వేడుకున్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలన్నారు. నటుడు అక్షయ్ కుమార్, కమల్ హాసన్ సైతం తమ విచారం తెలియజేశారు.

అసలు ప్రమాదం ఎలా జరిగిందంటే:

రైలు నంబర్ 12864 బెంగళూరు – హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు చెందిన పలు బోగీలు హౌరాకు వెళ్లే మార్గంలో పట్టాలు తప్పి పక్క ట్రాక్ మీద పడ్డాయి. అంతలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో అందులోని వ్యాగన్లు గూడ్స్ రైలుని ఢీకొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories