దుర్గం చెరువుపై చలాన్ల మోత

దుర్గం చెరువుపై చలాన్ల మోత
x
Highlights

* సందర్శకులకు వీకెండ్‌లోనే పర్మిషన్‌ ఇచ్చిన అధికారులు * సాధారణ సమయంలోనూ వెళ్తోన్న జనం * ప్రమాదకరంగా బ్రిడ్జిపై వాహనాలు నిలపడంతో ప్రమాదాలు * చలాన్లతో కంట్రోల్ చేస్తోన్న పోలీసులు * ఇప్పటివరకు 3,038 కేసులు నమోదు

దుర్గం చెరువుపై నిర్మించిన కేబల్ బ్రిడ్జ్ ప్రమాదకర సెల్ఫీ స్ఫాట్ గా మారింది. వీకెండ్లో సందర్శకుల కోసం అవకాశం కల్పించినా... వర్కింగ్ డేస్‌లో కూడా వంతెనపై వాహనాలు ఆపి మరీ ఫోటోల కోసం ఎగబడుతున్నారు. పోలీసులు ఎంత చెప్పినా లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారు. దీంతో చలాన్ల దండిస్తున్నారు పోలీసులు.

ఓ వైపు వాహనాలు.. మరోవైపు సందర్శకులతో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ రద్దీగా మారింది. ఇక్కడికి వచ్చే సందర్శకుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. అయితే బ్రిడ్జ్‌పై నుంచి వెళ్లే కొందరు చూపిస్తోన్న అత్యుత్సాహం ప్రమాదాలకు కారణమవుతోంది. రద్దీగా ఉండే రోడ్డులో వాహనాలు ఆపొద్దన్న కనీస ఆలోచన మరిచి ప్రవర్తిస్తుండటంతో.. వాహనదారులకు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తోంది. ముఖ్యంగా రాత్రిళ్లు లైటింగ్ కోసం వస్తోన్న వారితో సమస్యలు వస్తున్నాయి. దీంతో కేబుల్ బ్రిడ్జ్‌పై ఫోకస్ పెంచారు సైబరాబాద్ పోలీసులు.

బ్రిడ్జ్ సందర్శన కేవలం వీకెండ్స్‌లో అయినా.. సాదారణ రోజుల్లోనూ వంతెనపై వెళ్తూ వాహనాలు ఆపుతున్నారు పబ్లిక్. ప్రమాదకర రీతిలో వాహనాలు నిలిపి.. ఫోటోల కోసం ఎగబడుతున్నారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని అప్రమత్తమైన పోలీసులు.. మైకులు, సీసీటీవీలు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. చలాన్ల మోత మోగిస్తున్నారు. ఇప్పటివరకు 3 వేల 38 కేసులు నమోదు చేశారు.

వాయిస్ : ప్రమాదాలు నివారించేందుకు పూర్తిస్థాయి సాంకేతికతను వాడుతున్నారు పోలీసులు. హై రిజల్యూషన్ సిసిటివి కెమెరాలు, సెంట్రలైజ్‌డ్ ఐపి బేస్డ్ పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. వంతెనకు ఇరు వైపులా 13 మైకులు ఏర్పాటు చేసి.. కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. అక్కడి నుంచే బ్రిడ్జ్‌పై పరిస్థితులను మానిటరింగ్ చేసి.. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు చలాన్లు విధిస్తున్నారు.

తాము తీసుకుంటున్న చర్యలతో క్రమంగా ప్రమాదాలు తగ్గుతున్నాయంటోన్న పోలీసులు.. సందర్శకులు కేవలం వారాంతాల్లోనే రావాలని సూచిస్తున్నారు. ఫోటోల కోసం ప్రమాదాల బారిన పడొద్దని హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories