Tollywood: ప్రముఖ నిర్మాత సురేష్‌ కొండేటికీ మరో కీలక బాధ్యత..

Suresh Kondeti: ప్రముఖ నిర్మాత సురేష్‌ కొండేటి గురించి ప్రత్యేకంగా పరిచయం అవరసం లేదు. నిర్మాతగానే కాకుండా సినీ జర్నలిస్టుగా, సంతోషం సంస్థల అధినేతగా ఎంతో మందికి సురేష్‌ సుపరిచితుడు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 Nov 2024 11:00 AM IST
Tollywood: ప్రముఖ నిర్మాత సురేష్‌ కొండేటికీ మరో కీలక బాధ్యత..
X

Suresh Kondeti: ప్రముఖ నిర్మాత సురేష్‌ కొండేటి గురించి ప్రత్యేకంగా పరిచయం అవరసం లేదు. నిర్మాతగానే కాకుండా సినీ జర్నలిస్టుగా, సంతోషం సంస్థల అధినేతగా ఎంతో మందికి సురేష్‌ సుపరిచితుడు. ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతున్న సురేష్‌ కొండేటికి మరో పదవి వరించింది.

గతంలో సినిమా రంగంలో ఎన్నో కీలక బాధ్యతలను వ్యహరించిన సురేష్‌ కొండేటికి తాజాగా ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో కల్చరల్ కమిటీకి అడిషనల్ చైర్మన్‌ పదవి వరించింది. ఈ మేరకు ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ సెంటర్ ప్రెసిడెంట్ శ్రీ కె.ఎస్. రామారావు , సెక్రటరీ శ్రీ తుమ్మల రంగారావు చేతుల మీదుగా నియామక పత్రం సురేష్ కొండేటి అందుకున్నారు. కాగా కల్చరల్ కమిటీకి చైర్మన్‌గా ఎ.గోపాలరావు, కన్వీవర్‌గా ఏడిద రాజు నియమితులైనారు.

ఈ సందర్భంగా సురేష్‌ మాట్లాడుతూ.. దీనిని ఒక పదవిగా కాకుండా బాధ్యతగా స్వీకరిస్తానని తెలిపారు. కల్చరల్ కమిటీ అడిషనల్ చైర్మన్‌గా తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా సురేష్ కొండేటి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే సురేష్‌ కొండేటి గతంలో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (FNCC)లో ఎఫ్.ఎన్.సి.సి. కల్చరల్ కమిటీ సభ్యుడిగా, ప్రచార కమిటీకి చైర్మెన్ గా ఎఫ్.ఎన్.సి.సి. కల్చరల్ కమిటీ చైర్మెన్ గా తరువాత మేనేజ్మెంట్ కమిటీ మెంబర్‌గా అలాగే కల్చరల్ కమిటీ వైస్ చైర్మన్‌గా వ్యవహరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story