Hyderabad: 'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల.. 'వై డిమాలిషన్స్ ఇన్ హైదరాబాద్' అంశంపై చర్చా..

Hakku Initiative Hyderabad
x

Hyderabad: 'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల.. 'వై డిమాలిషన్స్ ఇన్ హైదరాబాద్' అంశంపై చర్చా..

Highlights

Hakku Initiative Hyderabad: ప్రజల, ప్రభుత్వ భాగస్వామ్యంతో సామాజిక చైతన్యాన్ని కలిగించే పలు కార్యక్రమాలు చేపడుతున్న హక్కు ఇనిషేటివ్ సంస్థ మన హక్కు హైదరాబాద్ కర్టెన్ రైజర్ ప్రచార గీతాన్ని శుక్రవారం ప్రముఖ సంగీత దర్శకుడు కోటి చేతుల మీదుగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఆవిష్కరించారు.

ప్రజల, ప్రభుత్వ భాగస్వామ్యంతో సామాజిక చైతన్యాన్ని కలిగించే పలు కార్యక్రమాలు చేపడుతున్న హక్కు ఇనిషేటివ్ సంస్థ మన హక్కు హైదరాబాద్ కర్టెన్ రైజర్ ప్రచార గీతాన్ని శుక్రవారం ప్రముఖ సంగీత దర్శకుడు కోటి చేతుల మీదుగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఆవిష్కరించారు. శనివారం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో 'వై డిమాలిషన్స్ ఇన్ హైదరాబాద్' అనే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హక్కు ఇనిషేటివ్ ఫౌండర్ డైరెక్టర్ డా.కోట నీలిమ, సీనియర్ అడ్వొకేట్, సోషల్ యాక్టివిస్ట్ లుబ్నా షరవత్, సోషల్ యాక్టివిస్ట్ పంకజ్ బాసిన్, మాంట్ పోర్ట్ సోషల్ ఇనిస్టిట్యూట్ ఫౌండేషన్ బ్రదర్ వర్గీస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన పలువురు సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, ప్రొఫెసర్లు పర్యావరణవేత్తలు పాల్గొని విలువైన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా హక్కు ఇనిషేటివ్ ఫౌండర్ డైరెక్టర్ డా.కోట నీలిమ మాట్లాడుతూ.. హైదరాబాద్ ను సుందర నగరంగా తీర్చిదిద్దే క్రమంలో హక్కు ఇనిషేటివ్ నుంచి మా వంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. గతంలో ప్రభుత్వం వైన్ షాప్స్ కు విపరీతంగా అనుమతులు ఇచ్చినప్పుడు ఇళ్ల మధ్య వైన్ షాప్స్ తొలగించేలా ప్రజల భాగస్వామ్యంతో ప్రయత్నం చేశామని, అలాగే నగరంలో వరదలు వచ్చినప్పుడు మా సంస్థ బాగా పనిచేసిందని చెప్పుకొచ్చారు. మూసి నదిని ప్రక్షాళన చేయాలని చెరువులను సంరక్షించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేధావుల నుంచి , పౌర సమాజం నుంచి మద్దతు లభిస్తోందని, ప్రజా భాగస్వామ్యంతోనే నిర్ణయాలు తీసుకోవాలన్నది, విధానాలు రూపొందించాలన్నది తెలంగాణలోని ప్రస్తుత ప్రభుత్వ విధానమన్నారు. ఈ చర్చా కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన పలువురు సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, ప్రొఫెసర్లు పర్యావరణవేత్తలు పాల్గొని విలువైన సూచనలు చేశారని, వాటి ఆధారంగా హక్కు ఇనిషియేటివ్ మూసి ప్రక్షాళన, చెరువుల సంరక్షణపై తీర్మానాలను రూపొందించిందన్నారు. త్వరలోనే ఈ తీర్మానాలను ప్రభుత్వానికి అందజేయబోతున్నామని స్పష్టం చేశారు.

ఇక సోషల్ యాక్టివిస్ట్ పంకజ్ బాసిన్ మాట్లాడుతూ.. ఈ రోజు వై డిమాలిషన్స్ ఇన్ హైదరాబాద్ అంశం మీద చర్చా కార్యక్రమం నిర్వహించామని, నీలిమ గారి సారథ్యంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల అభిప్రాయాలు సూచనలు తీసుకున్నామని తెలిపారు. అలాగే మాంట్ పోర్ట్ సోషల్ ఇనిస్టిట్యూట్ ఫౌండేషన్ బ్రదర్ వర్గీస్ మాట్లాడుతూ.. మూసీ నది ప్రక్షాళన చాలా విస్తృతమైన అంశమని, మూసీలోకి మురుగునీరు చేరకుండా చర్యలు చేపట్టాలి. మూసీ చుట్టుపక్కల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తే ఇది సాధ్యమే. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇందుకోసం ముందడుగు వేయాలని చెప్పుకొచ్చారు.




Show Full Article
Print Article
Next Story
More Stories