Bhairavam: 'భైరవం' నుంచి ఫోక్ యాంథమ్ - గుచ్చమాకే రిలీజ్

Bhairavam Movie Song
x

Bhairavam: 'భైరవం' నుంచి ఫోక్ యాంథమ్ - గుచ్చమాకే రిలీజ్

Highlights

Bhairavam Movie Song: డ్రమ్స్, ఎలక్ట్రిఫైడ్ బీట్స్ ఈ సాంగ్ అదిరిపోయింది. సౌండ్ కలర్ ఫుల్ ఫెస్టివల్ మూడ్ తో గిచ్చమాకు సాంగ్ కట్టిపడేసింది.

Bhairavam Movie Song: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం సమ్మర్ బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా రాబోతోంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కెకె రాధామోహన్ నిర్మించారు. పెన్ స్టూడియోస్‌ డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల అందించిన గ్రిప్పింగ్ స్కోర్ ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది. మొదటి మూడు ట్రాక్‌లు మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ లో ఉన్నాయి. ఈరోజు, వారు సినిమా నుండి గుచ్చమాకే ఫోక్ సాంగ్ ని రిలీజ్ చేశారు.

డ్రమ్స్, ఎలక్ట్రిఫైడ్ బీట్స్ ఈ సాంగ్ అదిరిపోయింది. సౌండ్ కలర్ ఫుల్ ఫెస్టివల్ మూడ్ తో గిచ్చమాకు సాంగ్ కట్టిపడేసింది. కాసర్ల శ్యామ్ లిరిక్స్ మాస్ ని ఆకట్టుకునేలా వున్నాయి. ధనుంజయ్ సీపాన, సౌజన్య భగవతుల ఎనర్జిటిక్ వోకల్స్ తో కట్టిపడేశారు.


బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బెస్ట్ డ్యాన్స్ మూవ్స్ తో అదరగొట్టేశారు. అదితి శంకర్ ప్రజెన్స్ ఆకట్టుకుంది. ఈ ఇద్దరూ కలసి ప్రతి ఫ్రేమ్‌ ఫెస్టివల్ వైబ్ తో అలరించారు.

ఫోక్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించబడిన ఈ పాట సంప్రదాయం, ఉత్సాహంతో అలరించింది. బిగ్ స్క్రీన్ పై ఈ సాంగ్ విజువల్ ట్రీట్ లా ఉండబోతోంది.

ఆనంది, దివ్య పిళ్లై ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హరి కె వేదాంతం డీవోపీ కాగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్. ప్రొడక్షన్ డిజైనర్‌గా బ్రహ్మ కడలి వర్క్ చేస్తున్నారు. సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాశారు.

మే 30న సినిమా థియేటర్లలోకి రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories