టీటీడీ ఆర్జిత సేవా టికెట్ల విడుదల

టీటీడీ ఆర్జిత సేవా టికెట్ల విడుదల
x
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానం ఆగస్టు నెల ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసింది. ఈ మేరకు టీటీడీ అధికారిక వెబ్సైటు లో వివరాలు పేర్కొంది. మొత్తం 67,737...

తిరుమల తిరుపతి దేవస్థానం ఆగస్టు నెల ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసింది. ఈ మేరకు టీటీడీ అధికారిక వెబ్సైటు లో వివరాలు పేర్కొంది. మొత్తం 67,737 టిక్కెట్లను విడుదల చేయగా అందులో జనరల్‌ క్యాటెగిరీ క్రింద 56,325 టిక్కెట్లు, ఆన్‌లైన్‌ ద్వారా 11,412 టిక్కెట్లు అందుబాటులో ఉంచనుంది. ఈ జనరల్‌ క్యాటెగిరీలో విశేషపూజ-1500, కళ్యాణం-13,300, ఉంజల్‌ సేవ-4200, ఆర్జిత బ్రహ్మోత్సవం-7425, వసంతోత్సవం-14,300, సహస్త్ర దీపాలంకారం15,600 టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. ఇక ఆన్‌లైన్‌ క్యాటెగిరీ క్రింద మొత్తం 11,412 టిక్కెట్లు విక్రయించనుండగా వాటిలో సుప్రభాతం-8117, తోమాల-120, అర్చన-120, అష్టాదలం-180, నిజపాదం-2875 టిక్కెట్లు అందుబాటులోఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories