27న శ్రీవారి దర్శనం నిలిపివేత

Raj
By Raj
Published on: 22 April 2019 10:05 AM IST
27న శ్రీవారి దర్శనం నిలిపివేత
X

ఈ నెల 27న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు తిరుమల జేఈఓ కేఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని వరాహస్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కారణంగా దర్శనం నిలిపివేస్తున్నట్టు చెప్పారు. ఇక ఇవాళ 22న అంకురార్పణ, రేపటినుంచి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 23న రాత్రి 8 గంటల సమయంలో కళాకర్షణం ఉంటుందని చెప్పారు. 24న యాగశాల కార్యక్రమాలు, 25న వరాహస్వామివారి మూలమూర్తి పాదపీఠిక వద్ద అష్టబంధన కార్యక్రమం, 26న మధ్యాహ్నం 3 గంటలకు అభిషేకం ఉంటుందన్నారు. 27న ఉదయం 11.07 నుంచి మధ్యాహ్నం 1.16 గంటల వరకు మహాసంప్రోక్షణ చేయనున్నట్లు చెప్పారు.

Raj

Raj

Next Story