Guru Purnima: జులై 10 న ఇలా చేయండి .. కెరీర్‌లో సక్సెస్‌ పొందుతారు..!

Guru Purnima: జులై 10 న ఇలా చేయండి .. కెరీర్‌లో సక్సెస్‌ పొందుతారు..!
x

Guru Purnima: జులై 10 న ఇలా చేయండి .. కెరీర్‌లో సక్సెస్‌ పొందుతారు..!

Highlights

జీవితంలో అందరికీ కెరీర్‌లో స్థిరత, ఎదుగుదల అవసరం. అయితే కొంతమందికి ఎంత చదివినా, ఎంత శ్రమించినా అనుకున్న స్థాయికి చేరుకోలేకపోతారు. ఇది శాస్త్రాల ప్రకారం గురు దోషం వల్ల కావొచ్చని చెబుతారు.

Guru Purnima : జీవితంలో అందరికీ కెరీర్‌లో స్థిరత, ఎదుగుదల అవసరం. అయితే కొంతమందికి ఎంత చదివినా, ఎంత శ్రమించినా అనుకున్న స్థాయికి చేరుకోలేకపోతారు. ఇది శాస్త్రాల ప్రకారం గురు దోషం వల్ల కావొచ్చని చెబుతారు. అలాంటి వారు ఈ ఏడాది జులై 10న వచ్చే గురు పౌర్ణమి రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటిస్తే మంచి ఫలితాలు కలగవచ్చని పండితులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ఆషాఢ పౌర్ణమి రోజున గురువును పూజించడం హిందూ సంప్రదాయంలో చాలా విశిష్టంగా భావిస్తారు. గురువు ఆషీర్వాదంతోనే విద్య, జ్ఞానం, జీవిత విజయాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. పద్మ పురాణంలో కూడ అందుకు సంబంధించిన ప్రాధాన్యతలు వివరించబడ్డాయి. గురువులను అవమానపరచడం వల్ల జీవితం లోని అడ్డంకులు వస్తాయని చెప్పబడింది. అందుకే గురు పౌర్ణమి రోజున గురువు లేదా తండ్రిని గౌరవించడం, వారికి పూజలు చేయడం ఎంతో మంగళకరమైనదిగా భావిస్తారు.

ఈ రోజున సాధారణంగా గురువుకు పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు స్వీట్లు, పసుపు, పసుపు రంగు పండ్లు మరియు పూలు సమర్పించడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఇవన్నీ గురు గ్రహానికి ప్రీతికరమైనవిగా పరిగణించబడతాయి. ఇలా చేయడం ద్వారా గురు గ్రహ ప్రభావం అనుకూలంగా మారుతుంది. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, కెరీర్‌లో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి.

గురువు అంటే కేవలం విద్య బోధించేవారే కాదు. మనకు జీవితం ఏ దిశగా నడిపించాలో చూపే మార్గదర్శకులు. అందుకే ఈ గురు పౌర్ణమి రోజున గురువు స్మరణతో పాటు వారికి మనస్ఫూర్తిగా పూజలు చేయడం ద్వారా పితృ దోషాలు, గురు దోషాలు తొలగిపోతాయని విశ్వసించబడుతోంది. దీనివల్ల జీవితంలో సుస్థిరత, విజయం, శ్రేయస్సు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ దినాన గురువుకు కృతజ్ఞతగా చిన్నయినా దానం చేయడం, వారి ఆశీర్వాదం పొందడం వల్ల మన జీవితం మరింత దిశగా సాగుతుంది. కెరీర్‌లో గమ్మత్తైన మార్పులు రావచ్చు. గురు పౌర్ణమి రోజున అలాంటి పవిత్రమైన ఆచారాలు పాటించడం వల్ల మీ విజయ మార్గం వెలుగునిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories