బాసర సరస్వతి అమ్మవారి కిరీటంలో వజ్రం మాయం

Raj
By Raj
Published on: 6 May 2019 8:34 PM IST
బాసర సరస్వతి అమ్మవారి కిరీటంలో వజ్రం మాయం
X

బాసర సరస్వతి అమ్మవారి బంగారం కిరీటంలో కెంపు మాయం అయినట్టు తెలుస్తోంది. అమ్మవారి కిరీటంలోని నవరత్నాల్లో ఒక కెంపు మాయమైన విషయాన్ని బయటికి తెలియనీయకుండా ఆలయ అధికారులు గోప్యంగా ఉంచారు. అయితే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఏమి జరుగుతుందో అని భక్తులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి విచారణకు ఆదేశించారు.

వారం రోజుల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని దేవాదాయశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. అలాగే బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు అమ్మవారి కెంపు ఎలా మాయం అయిందన్న దానిపై ఆలయ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తూ దొంగ కోసం పరిశీలిస్తున్నారు.

Raj

Raj

Next Story