బులెట్‌ ప్రూఫ్‌ అద్దాలలో బులెట్ ఎందుకు దిగదంటే!

బులెట్‌ ప్రూఫ్‌ అద్దాలలో బులెట్ ఎందుకు దిగదంటే!
x
Highlights

పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, వారి వాహనాలకు బులెట్‌ ప్రూఫ్‌ అద్దాలు వాడతారు, అయితే ఆ బులెట్‌ ప్రూఫ్‌ అద్దాలు ఎవరన్న బుల్లెట్ తో...

పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, వారి వాహనాలకు బులెట్‌ ప్రూఫ్‌ అద్దాలు వాడతారు, అయితే ఆ బులెట్‌ ప్రూఫ్‌ అద్దాలు ఎవరన్న బుల్లెట్ తో కాల్చినా కూడా ఎందుకు పగలవో మీకు తెలుసా? మనం సాధారణమైన అద్దాలు రాయితో కొడితే ముక్కలు ముక్కలు అయ్యి పగులుతాయి. అలాగే మాములు అద్దం గుండా తుపాకీ గుండు సులువుగా దూసుకుపోతుంది. కానీ బులెట్‌ప్రూఫ్‌ అద్దాల విషయంలో అలా జరగదు. ఎందుకంటే ఆ అద్దాలను అత్యంత పటిష్టమైన సిలికాన్‌నైట్రైడ్‌తో కూడిన పింగాణీ పదార్థంతోను, అతి దృఢమైన స్టీలు తోను, గరుకైన నైలాన్‌ పొరలతోను తయారు చేస్తారు. దృఢమైన పింగాణీ వేగంగా వచ్చే తుపాకి గుండును హఠాత్తుగా ఆపివేయడంతో దాని శక్తి గాజు పలకలోకి చొచ్చుకుపోకుండా, తగిలిన ప్రదేశంలోని పైపొరలోనే వివిధ దిశలకు వ్యాపిస్తుందట. అలా వేగం కోల్పోయిన తుపాకి గుండు గాజు పలక అవతలి వైపునకు పోకుండా ఆ గాజులోని నైలాన్‌ పొరలతో చేసే గజిబిజి వలలో చిక్కుకుపోతుందట. అందువల్ల బులెట్‌ప్రూఫ్‌ అద్దాలు పగలవు అందుకే ప్రముఖులు ఎక్కువ మంది వీటిని వాడతారు.శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories