అంబులెన్స్‌లు, వైద్యుల కార్లపై ఎర్రని ప్లస్‌!

అంబులెన్స్‌లు, వైద్యుల కార్లపై ఎర్రని ప్లస్‌!
x
Highlights

ఒక్కో వృతికి ఒక్కో గుర్తు వుంటుంది, అయితే మీరు పరిశీలిస్తే ఆసుపత్రులు, అంబులెన్స్‌లు, వైద్యుల కార్లపై ఎర్రని ప్లస్‌ గుర్తు ఉంటుంది. అయితే దాని...

ఒక్కో వృతికి ఒక్కో గుర్తు వుంటుంది, అయితే మీరు పరిశీలిస్తే ఆసుపత్రులు, అంబులెన్స్‌లు, వైద్యుల కార్లపై ఎర్రని ప్లస్‌ గుర్తు ఉంటుంది. అయితే దాని అర్థమేంటో మీకు తెలూసా? ఇది వాస్తవానికి తెల్లని నేపథ్యంలో ఎర్రని ప్లస్‌ గుర్తు ఉంటే అది అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ సంస్థ చిహ్నం. కొందరు ప్లస్‌ చుట్టూ గుండ్రని వలయం గీస్తారు. అప్పుడది రెడ్‌క్రాస్‌ చిహ్నం కాదు. నాలుగుసార్లు నోబెల్‌ శాంతి బహుమతి పొందిన రెడ్‌క్రాస్‌ సంస్థ, స్విట్జర్లాండ్‌ దేశస్థుడైన హెన్రీ డునాంట్‌ యుద్ధ సైనికులకు చికిత్స చేసే విధానాలపై రాసిన పుస్తకం ప్రేరణగా కొందరు 1863లో జెనీవాలో స్థాపించినది. అప్పట్లో తరచూ జరిగే యుద్ధాల్లో గాయపడిన సైనికులకు సేవచేసే వారిని గుర్తించి, ఎవరూ దాడి చేయకుండా ఉండడానికి ఈ చిహ్నం ఉపయోగపడేది. అదే నేడు ఆరోగ్య రంగానికి చిహ్నంగా మారింది. అది ఈ గుర్తువేనక గుర్తు అన్నట్టు.శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories