ఏటీఎం నుండి డబ్బులు ఇలా వస్తాయి...

ఏటీఎం నుండి డబ్బులు ఇలా వస్తాయి...
x
Highlights

ఏటీఎం కి వెళ్లి కొన్ని బటన్స్ నొక్కితే డబ్బులెలావస్తాయో మీకు తెలుసా ? అసలు ఏటీఎం (ATM) అంటే ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్ అని అర్ధం. దీనినే కొద్ది...

ఏటీఎం కి వెళ్లి కొన్ని బటన్స్ నొక్కితే డబ్బులెలావస్తాయో మీకు తెలుసా ? అసలు ఏటీఎం (ATM) అంటే ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్ అని అర్ధం. దీనినే కొద్ది మంది...ఎప్పుడైనా డబ్బు తీసుకునే అవకాశం ఉండడంతో 'Any Time Money' అని కూడా అంటుంటారు. అయితే బ్యాంకు ఖాతాదారులు ఈ యంత్రం ద్వారా డబ్బులు తీసుకోడానికి వీలుగా బ్యాంకులు ఏటీఎం కార్డును ఇస్తాయి కదా.. ఆ కార్డుపై ఉండే అయస్కాంతపు బద్దీ, లేదా ఇప్పుడు చిప్ విధానంలో ఖాతాదారుని వివరాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. కార్డును ఏటీఎం యంత్రంలోని స్లాట్‌లో జొప్పించగానే అందులోని PIN బ్యాంకులోని ఖాతాకు అనుసంధానమవుతుంది. ఖాతాదారునికి మాత్రమే తెలిసిన ఆ నెంబర్‌ను బటన్ ద్వారా నొక్కితేనే తదుపరి లావాదేవీలు జరిపేలా రక్షణ ఏర్పాటు ఉంటుంది. సరైన ఖాతాదారు తనకు కావాల్సిన డబ్బు ఎంతో సూచించగానే ఆ సంకేతాలు బ్యాంక్‌లో ఉండే సెంట్రల్ కంప్యూటర్‌కి అందుతాయి. అది ఆ ఖాతాలో బ్యాలన్స్‌ను సరిచూసి తిరిగి ఏటీఎంకు సంకేతాన్నిస్తుంది. వెంటనే ఏటీఎంలో యంత్రవిభాగాలు స్పందించి నోట్లను లెక్కిస్తాయి. సెంట్రల్ కంప్యూటర్‌తో అనుసంధానమై ఉండే ఇన్ఫ్రారెడ్ సెన్సింగ్ డివైస్ ఆ డబ్బు సరైన మొత్తంలో ఉందో లేదో గమనిస్తుంది. పొరపాటు ఉంటే 'రిజెక్ట్‌ బాక్స్‌'కి పంపిస్తుంది. సరిగా ఉంటే కరెన్సీ నోట్లు ఏటీఎంలోని డెలివరీ స్లాట్‌కు రోలర్ల సాయంతో చేరుకుని నెమ్మదిగా విడుదల అవుతాయి. ఆపై అతడు జరిపిన లావాదేవీ వివరాలను తెలిపే స్లిప్‌ కూడా బయటకి వస్తుంది. ఆపై ఏటీఎం ద్వారా బ్యాంకుకు సంకేతం అందగానే అక్కడి కేంద్రీయ కంప్యూటర్‌ ఎకౌంట్‌ను అప్‌డేట్‌ చేస్తుంది. అలా మొత్తానికి మన డబ్బు మనకి చేరుతుంది. శ్రీ.కో

Show Full Article
Print Article
Next Story
More Stories