పొట్టలో మాదకద్రవ్యాలు.. పోయిన ప్రాణం!

K V D Varma
Published on: 28 May 2019 1:50 PM IST
పొట్టలో మాదకద్రవ్యాలు.. పోయిన ప్రాణం!
X

ఆమధ్య వచ్చిన ఓ సినిమా తమిళ హీరో సూర్య నటించిన వీడొక్కడేగుర్తుందా? ఆ సినిమాలో మాదకద్రవ్యాలను తన పొట్టలో పెట్టుకుని హీరో దర్జాగా స్మగ్లింగ్ చేస్తాడు. సరిగ్గా ఇదే పద్ధతిలో మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తున్న జపాన్ కు చెందిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు.

జపాన్‌కు చెందిన జపాన్‌కు చెందిన 42 సంవత్సరాల ఉడో ఎన్‌అమెరికాలో నివాసం ఉంటున్నాడు. అతడు డ్రగ్స్‌ తరలింపును ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. ఇటీవల అతడు కడపులో దాదాపు ౨౪౬ కొకైన్‌ ప్యాకెట్లు నింపుకొని తాను నివాసం ఉంటున్న బగోటా నుంచి టోక్యో బయలుదేరాడు. తనిఖీల్లో ఎక్కడా దొరకకుండా బాగానే విమానం ఎక్కాడు. కానీ, పొట్టలో ప్యాకెట్ల మోతాదు ఎక్కువవడంతో విమానం కుదుపులకు లోనైనప్పుడు కొకైన్‌ లీకై శరీరంలోకి ప్రవేశించింది. దీంతో తీవ్రమైన కడుపునొప్పి అంటూ అరవడం మొదటు పెట్టాడు. విమానంలో ఉన్నవారికి అసలు విషయం తెలియదు. అందరూ కంగారుపడ్డారు.

సిబ్బంది అత్యవసరంగా ఉత్తర మెక్సికోలో విమానాన్ని దింపారు. స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తీరా శవపరీక్ష చేసిన తర్వాత శరీరంలో కొకైన్ మోతాదు ఎక్కువవడంతో గుండెపోటు వచ్చి మరణించినట్లు తేలింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

K V D Varma

K V D Varma

Next Story