బ్యాక్టీరియా, వైరస్‌ల మధ్య ముఖ్యమైన తేడా ఏమిటో మీకు తెలుసా?

బ్యాక్టీరియా, వైరస్‌ల మధ్య ముఖ్యమైన తేడా ఏమిటో మీకు తెలుసా?
x
Highlights

బ్యాక్టీరియా, వైరస్‌ల మధ్య ముఖ్యమైన తేడా ఏమిటో మీకు తెలుసా? బ్యాక్టీరియా, వైరస్‌ల మధ్య ప్రధానమైన ఒక తేడా వాటి పరిమాణం. బ్యాక్టీరియా వ్యాసం ఒక...

బ్యాక్టీరియా, వైరస్‌ల మధ్య ముఖ్యమైన తేడా ఏమిటో మీకు తెలుసా? బ్యాక్టీరియా, వైరస్‌ల మధ్య ప్రధానమైన ఒక తేడా వాటి పరిమాణం. బ్యాక్టీరియా వ్యాసం ఒక మైక్రోమీటర్‌ (మిల్లీమీటర్‌లో వెయ్యో వంతు) ఉంటే, వాటి పొడవు 1 నుంచి 3 మైక్రోమీటర్లు ఉంటుంది. అదే ఒక వైరస్‌ పొడవు 0.02 నుంచి 0.3 మైక్రోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక బ్యాక్టీరియా స్వతంత్రంగా సంతానోత్పత్తి చేయగల సూక్ష్మజీవి. వైరస్‌ వాటి పునరుత్పత్తికి జీవమున్న వేరే కణాలపై ఆధారపడతాయి. వైరస్‌లలో ఒక రకమైన న్యూక్లియక్‌ యాసిడ్‌ మాత్రమే ఉండి, వాటి ప్రాజనిక రూపం అయిన వాటి సంతతి డీఎన్‌ఏ లేదా ఆర్‌ఎన్‌ఏ మాత్రమే కలిగి ఉంటుంది. బ్యాక్టీరియా డీఎన్‌ఏలో జన్యు సంబంధిత సమాచారం పూర్తిగా ఉండడమే కాక, ఇతర జీవ ప్రక్రియలను కొనసాగించడానికి కావలసిన అన్ని రకాల ఆర్‌ఎన్‌ఏను కలిగి ఉంటుంది. బ్యాక్టీరియాను ఎదుర్కోవడం సులభం. ఎందుకంటే వాటి జీవప్రక్రియను యాంటీబయోటిక్స్‌ మందులతో అంతమొందించి చంపవచ్చు. వైరస్‌ల ఉత్పత్తి వేరే కణాల జీవ ప్రక్రియపై ఆధారపడి ఉండడంతో, వాటిపై యాంటీబయోటిక్స్‌ పనిచేయవు. ప్రస్తుత కాలంలో వైరస్‌లను అంతమొందించడానికి ఏవో కొన్ని మందులను మాత్రమే కనిపెట్టగలిగారు.శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories