ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందే తెలుస్తాయా?

ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందే తెలుస్తాయా?
x
Highlights

ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందే కొన్ని జంతువులు, పక్షులు వాటిని తెలుసుకుంటాయా? వాటికీ భవిష్యతు ఎలా తెలుస్తుంది? సునామి...లేదా కొన్ని ప్రకృతి...

ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందే కొన్ని జంతువులు, పక్షులు వాటిని తెలుసుకుంటాయా? వాటికీ భవిష్యతు ఎలా తెలుస్తుంది? సునామి...లేదా కొన్ని ప్రకృతి వైపరిత్యాలు వచ్చినప్పుడు పక్షులకి, జంతువులకి ముందు తెలిస్తాయని అంటారు... అయితే ...జీవులన్నింటికీ పరిశీలన శక్తి, సామర్థ్యాలు ఒకే విధంగా ఉండవు. ఉదాహరణకి మనం వంద అడుగుల దూరంలో ఉన్న ఈగను చూడలేం. కానీ గద్ద వేల అడుగుల దూరంలో ఉండే జంతువును కూడా చూడగలదు. భూకంపాలు, తుపాన్లు, సునామీలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు ఒక్క ఉదుటన ఏ విధమైన ముందస్తు సంకేతాలు లేకుండా రావు. అలాంటి సందర్భాల్లో ప్రకృతిలో చోటు చేసుకునే సున్నితమైన మార్పుల్ని కొన్ని పక్షులు, జంతువులు గ్రహించగలుగుతాయి. ఉదాహరణకు గాలిలో కలిగే మార్పులు, భూమిలో ఏర్పడే కంపనాల్ని, వాతావరణంలో హఠాత్తుగా మారే తేమ శాతం లాంటి వివరాలను అవి గుర్తించగలుగుతాయి. తద్వారా అవి ప్రకృతి వైపరీత్యాలను కొంత మేరకు ముందే పసిగట్టగలవు. శ్రీ.కో

Show Full Article
Print Article
Next Story
More Stories