చేప నిద్ర....

చేప నిద్ర....
x
Highlights

కొద్దిమందికి ఎప్పుడైనా ఆక్వేరియం లేదా గాజు బాక్స్ లో వున్నా చేపలు చూస్తే, వారికీ ఒక అనుమానం రావచ్చు, అసలు చేపలు నిద్రపోతాయా? అని...మరి మీకు తెలుసా ...

కొద్దిమందికి ఎప్పుడైనా ఆక్వేరియం లేదా గాజు బాక్స్ లో వున్నా చేపలు చూస్తే, వారికీ ఒక అనుమానం రావచ్చు, అసలు చేపలు నిద్రపోతాయా? అని...మరి మీకు తెలుసా చేపలు నిద్రపోతాయో లేదో! చేపలకు కనురెప్పలు ఉండవు కాబట్టి అవి ఎప్పుడు చూసినా కళ్లు తెరిచే ఉన్నట్టు కనిపిస్తాయి. అయితే అవి కూడా ఎంతో కొంత సేపు నిద్రపోతాయి. కొన్ని చేపలు పగటివేళ నిద్రిస్తే మరికొన్ని రాత్రివేళల్లో నిద్రిస్తాయి. నిద్రపోయే సమయం రాగానే సముద్రంలో ఉండే చేపలు నీటిలోతుల్లో ఉండే గుహల్లోకి, పగడపు లోయల్లోకీ వెళ్లి బంకమన్నులాంటి పదార్థాన్ని పూతగా తమ దేహాలపై ఏర్పాటుచేసుకుని తమ ఉనికిని ఇతర ప్రాణులు కనిపెట్టకుండా జాగ్రత్తగా నిద్రపోతాయి. చేపలు నిద్రించేపుడు వాటి జీవ ప్రక్రియలు కొంతమేర నెమ్మదించడంతో అవి అంత చురుగ్గా ఉండవు. అంతే కానీ అవి తమ స్పృహను పూర్తిగా కోల్పోవు. నిద్రించే చేపలపై పరిశోధనల మూలంగా తేలిందేమంటే అవి గాఢనిద్రలోకి చేరుకోకుండానే నెమ్మదిగా నీటిలో ఈదుతూనే ఉంటాయి.శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories