మాట్లాడేటప్పుడు వూపిరి పీల్చుకోవడం సాధ్యం ఎందుకు కాదో మీకు తెలుసా!

Arun Chilukuri
Published on: 15 Feb 2019 4:30 PM IST
మాట్లాడేటప్పుడు వూపిరి పీల్చుకోవడం సాధ్యం ఎందుకు కాదో మీకు తెలుసా!
X

అలా ఎందుకు జరగదు అంటే, మాట్లాడ్డం అంటేనే వూపిరిని బయటకు వదిలే నిశ్వాస ప్రక్రియకు ధ్వని కూడా తోడవడము కాబట్టి. గొంతులో ఉన్న శ్వాసపథ, ఆహారవాహిక కలిసే వుండే చోట శబ్ద పేటికలు ఉంటాయి. ఆ శబ్ద పేటికల కంపనమే శబ్దంగా మనం వింటాం. అది తన కంపనాలను నిశ్వాసలో వూపిరితిత్తుల నుంచి బయట పడుతున్న గాలిలోకి నింపుతుంది. ఇలా శబ్ద కంపనాలను నింపుకున్న గాలి కంపనాలను భాషకు అనుకూలంగా గొంతు, అంగిటి, నాలుక, దవడలు, పలువరుస, పెదాలు, ముక్కు సమన్వయం చేసుకుంటూ మాటల రూపంలో వ్యక్తం చేస్తాయి. మాటకు, మాటకు మధ్య లేదా వాక్యానికి, వాక్యానికి మధ్య మనం గాలిని లోపలకి పీల్చుకుంటామే తప్ప మాట్లాడే క్రమంలోనే ఉచ్ఛ్వాసం చేయడం అందువల్లే చేయడం ఇబ్బంది అవుతుందట. శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story