Volkswagen Big Discount: ఆఫర్ల జాతర మొదలు.. వోక్స్‌వ్యాగన్ ఈ కార్లపై లక్షల్లో డిస్కౌంట్లు..!

Volkswagen Big Discount: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ తన కార్ల అమ్మకాలను పెంచడానికి ఈ నెలలో అతిపెద్ద తగ్గింపును అందిస్తోంది.

Vamsi Krishna
Updated on: 7 March 2025 11:54 AM IST
Volkswagen Big Discount: ఆఫర్ల జాతర మొదలు.. వోక్స్‌వ్యాగన్ ఈ కార్లపై లక్షల్లో డిస్కౌంట్లు..!
X

Volkswagen Big Discount: ఆఫర్ల జాతర మొదలు.. వోక్స్‌వ్యాగన్ ఈ కార్లపై లక్షల్లో డిస్కౌంట్లు..!

Volkswagen Big Discount: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ తన కార్ల అమ్మకాలను పెంచడానికి ఈ నెలలో అతిపెద్ద తగ్గింపును అందిస్తోంది. ఈ మార్చి నెలలో మీరు రూ.4.20 లక్షల వరకు భారీగా పొదుపు చేసుకోవచ్చు. వాస్తవానికి, కంపెనీ తన కార్ల పాత స్టాక్‌ను (MY2024 స్టాక్) క్లియర్ చేసే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో ఏ కారుపై ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారో తెలుసుకుందాం.

వోక్స్‌వ్యాగన్ తన కాంపాక్ట్ ఎస్‌యూవీ టైగన్‌పై రూ. 2 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. 2024లో మిగిలిన యూనిట్లపై ఈ తగ్గింపు అందుబాటులో ఉంది. ఇందులో లాయల్టీ బోనస్, క్యాష్ డిస్కౌంట్, స్క్రాపేజ్, ఎక్స్ఛేంజ్ బోనస్ వంటి ఆఫర్‌లు ఉన్నాయి. అలానే టైగన్ 2025 మోడల్‌పై రూ. 1 లక్ష వరకు ఆఫర్‌లు అందిస్తుంది. ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.89 లక్షల నుండి రూ. 19.08 లక్షల వరకు ఉంది.

ఈ మార్చి నెలలో వోక్స్‌వ్యాగన్ వర్టస్‌పై రూ.1.5 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ దాని 2024 మోడల్స్‌పై ఇస్తున్నారు. 2025 మోడల్స్‌లో కూడా రూ.50,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ సెడాన్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.10.34 లక్షల నుంచి రూ.19 లక్షల వరకు ఉంది. ఈ కారులో అనేక గొప్ప ఫీచర్స్ ఉన్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ టిగువాన్‌పై మార్చి నెలలో రూ. 4.20 లక్షల వరకు తగ్గింపును అందించింది. ఇది ఈ కారు పాత మోడల్‌పై ఉంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్, ఎక్స్‌ఛేంజ్ బోనస్ ఉన్నాయి. ఫోక్స్‌వ్యాగన్ భారత్‌లో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలో భారత్‌లో రెండు కొత్త కార్లు విడుదల కానున్నాయి.

Vamsi Krishna

Vamsi Krishna

Next Story