VinFast VF3 EV: చూడచక్కని చిన్న ఈవీ.. తక్కువ ధరలోనే వావ్ అనిపిస్తుంది..!

VinFast VF 3 Small Electric SUV Showcased In Bharat Mobility Global Expo 2025
x

VinFast VF3 EV: చూడచక్కని చిన్న ఈవీ.. తక్కువ ధరలోనే వావ్ అనిపిస్తుంది..!

Highlights

VinFast VF3 EV: వియత్నాం ఆటోమొబైల్ విన్‌ఫాస్ట్ ఫేమస్ కంపెనీగా గుర్తింపు దక్కించుకుంది.

VinFast VF3 EV: వియత్నాం ఆటోమొబైల్ విన్‌ఫాస్ట్ ఫేమస్ కంపెనీగా గుర్తింపు దక్కించుకుంది. భారత కార్ మార్కెట్‌లో ఈ కంపెనీ వివిధ మోడల్ కార్లను విక్రయించాలని యోచిస్తోంది. న్యూఢిల్లీలో ఇటీవల ముగిసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కొన్ని సరికొత్త కార్లను ప్రదర్శించింది. అందులోనూ 'వీఎఫ్3' ఎలక్ట్రిక్ కారు అందరి దృష్టిని ఆకర్షించింది. రండి.. ఈ కారు ధర, పర్ఫామెన్స్, స్పెసిఫికేషన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

కొత్త విన్‌ఫాస్ట్ VF3 EV ఒక చిన్న ఎలక్ట్రిక్ కారు. ఇది అధునాతనమైన ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను కలిగి ఉంది. అలానే మెరుగైన హెడ్‌లైట్లు, క్రోమ్ గ్రిల్ బార్, బ్లాక్ బంపర్, 'V' షేప్‌ని పోలి ఉండే టెయిల్‌గేట్‌లను కలిగి ఉంటుంది.

ఈ కారు పరిమాణంలో మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్‌ను పోలి ఉంటుంది. అలాగే MG కామెట్‌లో ఎలక్ట్రిక్ కారు మాదిరిగానే '2-డోర్లు' ఉన్నాయి. 3,190 mm పొడవు, 1,679 mm వెడల్పు, 1,652 mm ఎత్తు. 2,075 mm వీల్‌బేస్‌ను కలిగి ఉంది.

కొత్త విన్‌ఫాస్ట్ VF3 EV అద్భుతమైన బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఉపయోగించే ఎలక్ట్రిక్ మోటార్ 40 పిఎస్ హార్స్ పవర్, 110 ఎన్ఎమ్ (న్యూటన్ మీటర్) పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని చెబుతున్నారు. ఫుల్ ఛార్జింగ్ పెడితే రేంజ్ (మైలేజ్) 215 కిలోమీటర్లు అని అంచనా వేస్తున్నారు.

కొత్త విన్‌ఫాస్ట్ VF3 EV డజన్ల కొద్దీ ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది. వివిధ ఫీచర్లు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (10-అంగుళాల), 2-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉన్నాయి. భద్రత పరంగా ఇందులో మల్టీ ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నాయి.

కొత్త విన్‌ఫాస్ట్ VF3 EVని తమిళనాడులోని తూత్తుకుడిలో కంపెనీ కొత్తగా నిర్మించిన మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో తయారు చేసినట్లు చెప్పారు. ఈ కొత్త కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.10 లక్షల లోపే ఉంటుందని చెబుతున్నారు. ఇది అక్టోబర్‌లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అలానే విన్‌ఫాస్ట్ కంపెనీ భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో వివిధ స్కూటర్లను కూడా ప్రదర్శించింది. Theon S, Evo S, Clara S, Vento S, Feliz S, Dragonfly పేరుతో స్కూటర్లను ఆవిష్కరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories